జీతం ఇవ్వలేదనే కారణంతో మంత్రిని కాల్చి చంపిన బాడీగార్డ్.. ఎక్కడంటే ?

Uganda: ఆ తర్వాత గాల్లోకి కాల్పులు జరిపి తనను తాను కాల్చుకున్న గార్డు

Jyothi
Published on: 3 May 2023 10:12 AM IST
Bodyguard  Shot and Killed the Minister for Non-Payment of Salary
X

జీతం ఇవ్వలేదనే కారణంతో మంత్రిని కాల్చి చంపిన బాడీగార్డ్.. ఎక్కడంటే ?

Uganda: ఉగాండాలో దారుణం జరిగింది. జీతం ఇవ్వలేదనే కారణంతో కల్నల్ ఎగోలా అనే ఓ మంత్రిని అతడి బాడీగార్డ్ సబిజిత్ కాల్చి చంపాడు. ఈ ఘటన ఉగాండా రాజధాని కంపాలా శివారులోని ఎంగోలా నివాసంలో చోటు చేసుకుంది. అనంతరం అతడు కూడా కాల్చుకొని చనిపోయాడు.ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ కాల్పులకు స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ.. గార్డుకు మంత్రికి వేతనాలపై వివాదం ఉందని తెలుస్తుంది.

సబిజిత్ తనను తాను కాల్చుకోవడానికి ముందు ఆ చుట్టుపక్కల కాసేపు తచ్చాడాడని, ఆ తర్వాత గాల్లోకి కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, మంత్రి ఇంటిలో జరిగిన కాల్పుల ఘటనలో మంత్రి సహాయకుడు రొనాల్డో ఒటిమ్ గాయపడ్డారు. కంపాలాలోని ములాగో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాల్పుల్లో మరికొందరు కూడా గాయపడినట్టు తెలుస్తోంది. ఘటన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున జనం గుమికూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వంలో కల్నల్ ఎగోలా సీనియర్ సభ్యుడు. ఇంతకుముందు ఆయన రక్షణ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు.

Jyothi

Jyothi

Next Story