Britain: గాలిలో ఎగిరే నౌకలు

Britain: ఇక్కడ నౌకలు గాల్లో ఎగురుతాయి. చిన్న చిన్నవే కాదు.. అత్యంత భారీ నౌకలు కూడా గాల్లో తేలుతూ కనిపిస్తాయి.

Arun Chilukuri
Updated on: 22 March 2021 9:00 PM IST
Boats seen Floating in the Sky Around Britain
X

Britain: గాలిలో ఎగిరే నౌకలు

Britain: ఇక్కడ నౌకలు గాల్లో ఎగురుతాయి. చిన్న చిన్నవే కాదు.. అత్యంత భారీ నౌకలు కూడా గాల్లో తేలుతూ కనిపిస్తాయి. అలా తేలుతున్న నౌకలను కళ్లతో చూడటమే కాదు, ఫొటోలూ తీసుకోవచ్చు ఇదేం వింత అనుకుంటున్నారా? అంతా వాతావరణం మహిమ అంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణంలో కొన్ని ప్రత్యేకతలతో ఏర్పడే దృష్టి భ్రమ దీనికి కారణం అంటున్నారు. వేసవిలో కనిపించే ఎండమావుల లాంటి పరిస్థితిగా చెప్పవచ్చు.

సముద్రంలో దూరంగా ఉన్న నౌకలు గాల్లో తేలుతున్నట్టుగా కనిపించే ఈ దృష్టి భ్రమను ఫటా మోర్గానా అంటారు. నౌకలేకాదు దూరంగా సముద్రం కూడా కొంత పైకి లేచినట్టుగా అనిపిస్తుంటుంది. పలుచోట్ల సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి కాస్త అరుదుగా ఈ తరహా దృష్టి భ్రమ కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిన ఈ దృశ్యాల్ని బీచ్‌కు వెళ్ళినవారు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story