Biden-Trump: అధ్యక్ష పోరు.. చర్చకు ‘ట్రంప్‌-బైడెన్‌’ సిద్ధం

Biden-Trump: జూన్ 27న జో బైడెన్-ట్రంప్ మధ్య తొలి డిబేట్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 26 Jun 2024 2:29 PM IST
Biden Trump Are Preparing For A Crucial Presidential Debate
X

Biden-Trump: అధ్యక్ష పోరు.. చర్చకు ‘ట్రంప్‌-బైడెన్‌’ సిద్ధం

Biden-Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పోరులో అసలు సిసలు అంకానికి రంగం సిద్ధమైంది. ప్రెసిడెంట్ రేసులో ఉన్న ట్రంప్-బైడెన్ మధ్య ఓపెన్ డిబేట్ కు డేట్ అండ్ టైమ్ రెండూ ఫిక్స్ అయిపోయాయి. ఇక ఎదురెదురుగా.. వాడివేడిగా వాగ్బాణాలు సంధించడం ఒక్కటే బ్యాలెన్స్. అయితే, ఈ ఓపెన్ డిబేట్ పై అందరిలోనూ వినిపిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న.. తెంపరి ట్రంప్ ముందు బైడెన్ నిలబడగలుగుతారా అన్నదే. ఎందుకంటే, రీసెంట్ టైమ్స్ లో జో బైడెన్ ను మతిమరుపు పరేషాన్ చేస్తోంది. ఇంతకూ, 81 ఏళ్ల బైడెన్, 78 ఏళ్ల ట్రంప్ మధ్య వాడీవేడి చర్చ ఏ రేంజ్ లో ఉండబోతోంది? వృద్ధ సింహాల గర్జనలో ఎవరిది పై చేయి కాబోతోంది?

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story