Joe Biden: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ పోటీ చేయకపోతే.. నేనూ చేయనేమో

Joe Biden: ప్రచారం కోసం నిధులు సేకరిస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్

Shekhar G
Published on: 6 Dec 2023 7:03 PM IST
Biden says stopping Trump is the motivation for the second term
X

Joe Biden: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ పోటీ చేయకపోతే.. నేనూ చేయనేమో

Joe Biden: 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటికే ప్రస్తుత, మాజీ అధ్యక్షులు బైడెన్‌, ట్రంప్‌ రంగంలోకి దిగారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రచారం కోసం నిధులు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో బోస్టన్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ట్రంప్‌ మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీలో లేకపోతే.. తాను కూడా పోటీ చేయకపోవచ్చని వ్యాఖ్యానించారు.

ట్రంప్ పోటీలో లేకపోతే.. నేను పోటీ చేస్తానో లేదో కచ్చితంగా తెలియదనీ, కానీ ఈ దేశం కోసం ఆయన్ను మాత్రం గెలవనివ్వమని బైడెన్‌ అన్నారు. ప్రస్తుత, మాజీ అధ్యక్షులు అయిన బైడెన్, ట్రంప్‌.. తాము ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా నిలిచిన బైడెన్‌‌కు ఓటర్లు మరోసారి అవకాశం ఇస్తారా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎన్నికల్లో బైడెన్‌ వయసు అంశం ప్రధానం కానుంది. రెండోసారి విజయం సాధించి పదవీకాలం పూర్తి చేసేనాటికి 86 ఏళ్లకు చేరుకోనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story