New York: న్యూయార్క్‌లో కాల్పుల మోత

New York: 10 మంది మృతి, పలువురికి గాయాలు

Rama Rao
Updated on: 15 May 2022 10:28 AM IST
At Least 10 Dead in Mass Shooting at New York Supermarket | Telugu News
X

New York: న్యూయార్క్‌లో కాల్పుల మోత

New York: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. న్యూయార్క్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. సూపర్ మార్కెట్‌లోకి సైనికుడి వేషంతో తుపాకీతో ప్రవేశించిన దుండగుడు.. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. దుండగున్ని FBI అధికారులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నల్లజాతీయులు అధికంగా ఉన్న చోట ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనకు జాతి విద్వేషమే కారణమని భావిస్తున్నారు. ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు.


Rama Rao

Rama Rao

Next Story