Ashraf Ghani: వీడియో రిలీజ్ చేసిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ

Ashraf Ghani: తాను కట్టుబట్టలతోనే కాబూల్‌ నుంచి వచ్చానని క్లారిటీ, డబ్బులు తీసుకెళ్లినట్లు వస్తున్న ఆరోపణలు అబద్ధం: ఘనీ

Shireesha
Updated on: 19 Aug 2021 10:48 AM IST
Ashraf Ghani Released a Video about Where He Went and Money Rumors on Him | Afghanistan Latest News
X

వీడియో రిలీజ్ చేసిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ

Ashraf Ghani: అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పారిపోయిన తర్వాత మొదటిసారి వీడియోను విడుదల చేశారు. తాను కట్టుబట్టలతోనే ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచి వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. దేశం నిధుల నుంచి నయా పైస తీసుకోలేదని వెల్లడించారు. రష్యా దేశ దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యలను ఘనీ తీవ్రంగా ఖండించారు. తాను యునైటెడ్ ఎమిరేట్స్ లోనే ఉన్నానని ఘనీ వెల్లడించారు.

తాను డబ్బు తీసుకెళ్లినట్లు వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని వీడియోలో ఘనీ వివరించారు. కావాలంటే యూఏఈ కస్టమ్స్ అధికారులతోనూ ధ్రువీకరించుకోవచ్చని ఘనీ అన్నారు. దేశాధినేతగా తనకున్న ముప్పు కారణంగానే పారిపోయానని చెప్పుకొచ్చారు. దేశంలో రక్తపాతాన్ని నివారించడానికే పారిపోయినట్లు తనని తాను సమర్థించుకున్నారు.


Shireesha

Shireesha

Next Story