హెజ్‌బొల్లాకు మరోసారి ఊహించని షాక్

ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో మరో హెజ్‌బొల్లా కీలక నేత నబిల్‌ మరణించారు. ఆయన హెజ్‌బొల్లా సెంట్రల్‌ కౌన్సిల్‌లో డిప్యూటీ హెడ్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 29 Sept 2024 7:15 PM IST
Hezbollah
X

Hezbollah

ఉగ్రవాద గ్రూపు హెజ్‌బొల్లాకు మరోసారి ఊహించని దెబ్బతగిలింది. ఇజ్రాయెల్‌ ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో మరో హెజ్‌బొల్లా కీలక నేత నబిల్‌ కౌక్‌ హతమయ్యాడు. హెజ్‌బొల్లా సెంట్రల్‌ కౌన్సిల్‌లో డిప్యూటీ హెడ్‌గా ఉన్న నబిల్‌ మృతిచెందినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. అయితే దీనిపై హెజ్‌బొల్లా నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

గత కొన్ని వారాలుగా లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్‌పై.. ఇజ్రాయెల్‌ భీకరదాడులు చేస్తోంది. శుక్రవారం జరిగిన దాడిలో హెజ్‌బొల్లా అధినేత హసన్‌ నస్రల్లా మృతి చెందడం ఆ గ్రూపునకు శరాఘతంలా మారింది. ఈ తరుణంలోనే మరో కీలక నేతను కోల్పోవడం గమనార్హం. నబిల్‌ 1995 నుంచి 2010 వరకు సౌత్‌ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలటరీ కమాండర్‌గా పనిచేశాడు. 2020లో అతడిపై అమెరికా ఆంక్షలు విధించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story