Miss Universe 2021: మిస్ యూనివర్స్‌గా ఆండ్రియా మేజా
Miss Universe 2021: మిస్ యూనివర్స్-2021 కిరీటాన్ని మెక్సికో అందం ఆండ్రియా మేజా సొంతం చేసుకుంది.
Miss Universe 2021: మిస్ యూనివర్స్‌గా ఆండ్రియా మేజా
Miss Universe 2021: మిస్ యూనివర్స్-2021 కిరీటాన్ని మెక్సికో అందం ఆండ్రియా మేజా సొంతం చేసుకుంది. 73 మందిని దాటుకొని 26ఏళ్ల మేజా ఈటైటిల్‌ను గెల్చుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందిన ఆమె.. ఈ అందాల కిరీటాన్ని దక్కించుకున్న మూడో మెక్సికన్‌గా నిలిచింది. మోడలింగ్‌పై ఆసక్తి గల ఆమె.. చిహువా టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ తమ సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి చాటిచెబుతున్నారు. అంతేగాకుండా, మహిళా హక్కులపై ఉద్యమిస్తూ.. లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. ఇక సర్టిఫైడ్ మేకప్ ఆర్టిస్టు మోడల్ అయిన ఆండ్రియాకు క్రీడల అంటే కూడా ఆసక్తి. జంతు హింసను తట్టుకోలేని ఆమె వీగన్‌గా మారిపోయారు. పూర్తి శాకాహారమే తీసుకుంటున్నారు.
Next Story




