America: ప్రధాని మోడీ కామెంట్స్‌పై స్పందించిన అమెరికా

America: ఇరు దేశాల మధ్య జోక్యం చేసుకోవడం లేదన్న అమెరికా

Shashank Gullapelli
Published on: 17 April 2024 4:32 PM IST
America Reacts On PM Modi Comments
X

America: ప్రధాని మోడీ కామెంట్స్‌పై స్పందించిన అమెరికా

America: ఉగ్రవాదుల్ని వెంటాడి మట్టుబెడతామన్న ప్రధాని నరేం‍ద్ర మోడీ వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అగ్రరాజ్యం సూచించింది. రెండు దేశాల మధ్య అమెరికా జోక్యం చేసుకోవడం లేదు..కానీ ఉద్రిక్తతల నివారణకు ఆ దేశాలు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. 2019లో పుల్వామా ఘటన తర్వాత నుంచి భారత్‌కు ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను న్యూదిల్లీ లక్ష్యంగా చేసుకొందన్న ఆరోపణలను మన విదేశాంగశాఖ ఖండించింది. అదంతా తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది. అయితే ప్రధాని మోడీ, రాజ్‌నాథ్ మాత్రం..ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఎక్కడికైనా వెళతామని తేల్చిచెప్పడం చర్చనీయాంశంగా మారింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story