America: తాలిబన్లకు అమెరికా షాక్‌.. బ్యాంకుల్లోని ఆఫ్ఘన్‌ నిధులు ఫ్రీజ్‌..

America freezes Afghan Reserves
x

America: తాలిబన్లకు అమెరికా షాక్‌.. బ్యాంకుల్లోని ఆఫ్ఘన్‌ నిధులు ఫ్రీజ్‌..

Highlights

America: ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకొని దూకుడుమీదున్న తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది.

America: ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకొని దూకుడుమీదున్న తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. అమెరికా బ్యాంకుల్లోని ఆఫ్ఘన్‌ దేశానికి సంబంధించిన నిధులను ఫ్రీజ్ చేసింది. దాదాపు 9.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తలను స్తంభింపజేసింది. తాలిబన్ల చేతిలో నిధులు దుర్వినియోగం అవుతాయన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అఫ్గాన్‌ సెంట్రల్‌ బ్యాంకులో ఉన్న డబ్బు తాలిబన్ల చేతికి చిక్కకుండా అమెరికా ఈ ఎత్తుగడ వేసినట్టు సమాచారం. అమెరికాలో ఏ సెంట్రల్‌ బ్యాంకులో ఉన్న ఆస్తులూ తాలిబన్లకు అందుబాటులో ఉంచకుండా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

కాబుల్ నగరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచే అమెరికా బ్యాంకుల్లోని ఆప్ఘన్‌ ప్రభుత్వ నిధులను స్తంభింపజేసినట్టు తెలుస్తోంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ జనెత్‌ యెల్లెన్‌, ఆ కార్యాలయంలోని విదేశీ ఆస్తుల నియంత్రణ సిబ్బంది ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వ ఖాతాలను స్తంభింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అలాగే అమెరికా నుంచి కాబూల్‌కు నగదు రవాణా కూడా నిలిచిపోయినట్టు తెలుస్తోంది.

మ‌రోవైపు ఇప్పటివరకు 3వేల 200 మందిని కాబూల్‌ నుంచి తరలించామని అమెరికా వైట్‌హౌస్‌ ప్రకటించింది. అమెరికా రక్షణ విమానాల ద్వారా ఆఫ్ఘన్‌ నుంచి తరలించామని, అందులో 11 వందల మంది అమెరికా పౌరులు, యూఎస్‌లో శాశ్వత నివాసం కలిగినవారు ఉన్నారని తెలిపింది. మరింత మంది ఆఫ్ఘన్ దేశాన్ని వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories