కరోనా కంట్రోల్ కు పోటాపోటీ ప్రయత్నాలు.. ప్రభావం చూపుతున్న చైనా మందు..

కరోనా కంట్రోల్ కు పోటాపోటీ ప్రయత్నాలు.. ప్రభావం చూపుతున్న చైనా మందు..
x
Highlights

కల్లోల కరోనా మందుల్లేవ్ నివారణ ఒక్కటే మార్గం. ముందస్తు జాగ్రత్తలతో ముప్పుని ఎదుర్కొవచ్చు. ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనాకు చెక్ పెట్టేందుకు...

కల్లోల కరోనా మందుల్లేవ్ నివారణ ఒక్కటే మార్గం. ముందస్తు జాగ్రత్తలతో ముప్పుని ఎదుర్కొవచ్చు. ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రపంచదేశాలు ప్రయత్నిస్తున్నాయి. పోటాపోటీగా టీకా తయారీలో పడ్డాయి .మరి టీకా తయారీకి ఎన్నిరోజులు పడుతోంది..క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ చేసుకుని ఎప్పటిలోగా వస్తోంది..?

కరోనా యమ డేంజర్. మూడు అక్షరాలే అయినా ముచ్చెటమలు పట్టిస్తోంది. దేశాలకు దేశాలే చిగురుటాకులా వణుకుతున్నాయి. నివారణకు ముందు జాగ్రత్తలు తీసుకుంటోన్నా లోలోపల భయం ప్రపంచాన్ని వెంటాడుతోంది. కల్లోల కరోనా కంట్రోల్ కోసం దేశాలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్‌ తయారీ పనిలో పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 12 ఫార్మా సంస్థలు ఇందులో తలమునకలయ్యాయి. క్యూర్ కరోనా టీకా కోసం 800 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి.

కరోనా విలయాన్ని తొలిగా చూసిన చైనా యాంటీ వైరల్‌ డ్రగ్‌ 'ఫావిపిరావిర్‌'ను వినియోగించింది. ఈ డ్రగ్ సమర్థంగా పనిచేస్తోందని తెలిపింది. షెన్‌జెన్‌ ఆసుపత్రిలో 80 మందిపై క్లినికల్‌ ట్రయల్స్ చేసింది. వీరిలో 'ఫావిపిరావిర్‌' వాడిన 35 మంది వైరస్‌ నుంచి అతి త్వరగా కోలుకున్నారని చైనా ప్రకటించింది.

అటు రష్యా రంగంలోకి దిగింది. జూన్‌ నాటికి కరోనాకు అత్యంత కచ్చితమైన టీకాను తెచ్చేందుకు పరీక్షలు ప్రారంభించింది. ప్రయోగశాలల్లో జంతువులపై పరిశోధనలు చేస్తోంది. ఇక కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని, త్వరలో వెల్లడిస్తామని ఇజ్రాయెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ రిసెర్చ్‌ వారం క్రితమే చెప్పింది. శాస్త్రవేత్తలు కరోనా జన్యుపటం, లక్షణాలను విశ్లేషించారని, ఇక ప్రిక్లినికల్‌, క్లినికల్‌ ట్రయల్స్‌ చేయాల్సి ఉందని తెలిపింది. ఈ ట్రయల్స్‌కు నెలల సమయం పట్టే చాన్స్ ఉంది.

కరోనా వైరస్‌కు ఆరు నెలల్లో మందు రూపొందించేందుకు భారత్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొవిడ్‌-19 విరుగుడు మందు తయారీకి ఐఐసీటీతో సిప్లా చేతులు కలిపింది. వైరస్‌ను అడ్డుకునే మూడు యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియంట్లను ఐఐసీటీ యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తుంది. వాటిని ఔషధాలుగా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిప్లా ప్రయత్నాలు చేస్తుంది. వైరస్ ను తరిమేసేందుకు వరల్డ్ వైడ్‌గా పోటీపోటీగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా ఎవరి టీకా వస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories