Top
logo

బ్రిడ్జి కింద ఇరుక్కున్న విమానం.. వీడియో వైరల్‌..

బ్రిడ్జి కింద ఇరుక్కున్న విమానం.. వీడియో వైరల్‌..
X
Highlights

రన్ వే పై దూసుకుపోయే విమానం బ్రిడ్జి కింద ఇరుక్కోవడం ఏమిటని ఆశ్చర్యపోకండి! ఈ ఘటన నిజంగానే జరిగింది. చైనాలోని...

రన్ వే పై దూసుకుపోయే విమానం బ్రిడ్జి కింద ఇరుక్కోవడం ఏమిటని ఆశ్చర్యపోకండి! ఈ ఘటన నిజంగానే జరిగింది. చైనాలోని హర్బిన్‌లో ఓ విమానాన్ని రోడ్డు మార్గం మీదుగా విమానాశ్రయానికి తరలించారు. ఇతర వాహనాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆ విమానానికి రెక్కలు తొలగించి తరలిస్తుండగా ఓ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది.

డ్రైవర్ ఎత్తుని సరిగ్గా అంచనా వేసుకోకుండా ట్రక్‌ను ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆ విమానం వంతెన కింద ఇరుక్కుంది. డైవర్లు ట్రక్కు టైర్లలో కొంచెం గాలిని తొలగించారు. దీంతో ట్రక్కు ఎత్తు కొంచెం తగ్గింది. ఆ తర్వాత నెమ్మదిగా వాహనాన్ని కొంచెం ముందుకు కదలించారు. బ్రిడ్జి కింద నుంచి వాహనం బయటపడడంతో మళ్లీ టైర్లలో గాలిని నింపి విమానాన్ని అక్కడ్నుంచి తరలించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.


Next Story