Afghanistan: సూసైడ్ బాంబర్లపై తాలిబన్ హోంమంత్రి ప్రశంసలు

* 125 డాలర్లు, ఓ ఫ్లాట్... ఆర్థిక సాయం ప్రకటన! * షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్న సూసైడ్ బాంబర్లు

Sandeep Reddy
Updated on: 20 Oct 2021 9:00 AM IST
Afghanistan Home Minister Sirajuddin Haqqani Praised the Self Destruction Bombers
X

సూసైడ్ బాంబర్లపై తాలిబన్ హోంమంత్రి ప్రశంసలు (ఫైల్ ఫోటో)

Afghanistan: ఆత్మాహుతి దాడులతో వందలాదిమంది ప్రాణాలను బలిగొంటున్న సూసైడ్ బాంబర్లపై తాలిబన్ మంత్రి ప్రశంసలు కురిపించారు. వారు అమరవీరులంటూ కొనియాడారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆఫ్ఘన్ హోంశాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ ఈ వ్యాఖ్యలు చేశారు. సూసైడ్ బాంబర్ల త్యాగాలు ఎనలేనివని ప్రశంసించారు. వారు ఈ దేశానికి, ఇస్లాంకు హీరోలని అభివర్ణించారు. వారి కుటుంబాలకు 125 డాలర్లు, ఓ ఫ్లాట్ ఇస్తామని మంత్రి ప్రకటించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌లో షియా ముస్లింలే లక్ష్యంగా వరుస ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి. ఈ నెల 8న కుందుజ్ ప్రావిన్స్‌లో, 15న కాందహార్‌లోని షియా మసీదులో జరిగిన ఆత్మహుతి దాడుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. షియా ముస్లింలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story