Ashraf Ghani: అబుదాబీలో అప్ఘాన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ?

Ashraf Ghani: తాలిబన్లకు భయపడి పలాయనమంత్రం పఠించిన నేత * డబ్బు సంచులతో ఉడాయించిన ఘనీ..

Sandeep Eggoju
Published on: 18 Aug 2021 6:19 PM IST
Afghanistan Ex President Ashraf Ghani is in Abu Dhabi
X

అబూ దాబిలో ఆఫ్గనిస్తాన్ మాజీ ప్రెసిడెంట్ అష్రాఫ్ ఘని (ఫైల్ ఇమేజ్)

Ashraf Ghani: అష్రాఫ్ ఘనీ ఇప్పుడెక్కడున్నారు? ఇది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ప్రజలకు ధైర్యం చెప్పి, వెన్నుదన్నుగా నిలవాల్సిన అధ్యక్షుడు ఘనీ.. తోక ముడిచారు.. తనకు కావలసినంత మేర డబ్బు సంచుల్లో కూరుకుని ఆయన పలాయన మంత్రం పఠించారు.. హెలికాప్టర్ లో పట్టినంత మేర డబ్బు కుక్కుకుని మిగిలిన నోట్ల కట్టలను రన్ వే పైనే పడేసి ఆయన ఉడాయించారు. ఆయన హెలికాప్టర్ ఎటువైపు ప్రయాణించినదీ కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారు.. ప్రస్తుతం అష్రాఫ్ ఘనీ అబుదాబీలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రజల సొమ్మును లూటీ చేసి తీసుకుపోయిన ఘనీని డిటైన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story