Afghanistan - Kabul: కాబుల్ లో భయం భయం, 180 దాటిన మృతుల సంఖ్య

Afghanistan - Kabul: * ఆత్మాహుతి దాడుల్లో 180 దాటిన మృతుల సంఖ్య * 169 మంది ఆప్ఘన్‌లే ఉన్నారన్న అధికారులు

Shireesha
Published on: 28 Aug 2021 9:58 AM IST
Afghanistan Capital Kabul Airport Attack Fear Increasing in Public Day by Day | Afghanistan Live Updates
X

కాబుల్ లో భయం భయం, 180 దాటిన మృతుల సంఖ్య

Afghanistan - Kabul: ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ చివురటాకులా వణికిపోతోంది. ఆ ప్రాంతంలో ఉన్న వారు భయందోళనకు గురి అవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అనుక్షణం భయందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎటు వైపు నుంచి బాంబు పేలుతుందోనని క్షణ క్షణం చావు బతుకుల మధ్య కాలం గడుపుతున్నారు. ఐసిస్‌ ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు దాడులతో హమీద్ కర్జాయ్ విమాశ్రాయ పరిసరాలు కకావికలమయ్యాయి.. ఈ దాడుల్లో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు దాడుల్లో 180పైనే మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరణించిన వారిలో అధిక శాతం మంది ఆప్ఘన్‌లే ఉన్నారని అధికారులు ప్రకటించారు..

Shireesha

Shireesha

Next Story