ప్లీజ్‌ మా పిల్లలనైనా తీసుకెళ్లండి..ఇనుప కంచెపై నుంచి విసిరేస్తున్న తల్లులు!

Afghanistan: తాలిబన్ల అరాచక పాలన నుంచి తప్పించుకునేందుకు ఆఫ్గాన్ పౌరులు చేయని ప్రయత్నం లేదు.

Arun Chilukuri
Updated on: 19 Aug 2021 3:38 PM IST
Afghan Mothers Throwing Babies Over Barbed Wire Fences
X

Afghanistan: ప్లీజ్‌ మా పిల్లలనైనా తీసుకెళ్లండి.. ఇనుప కంచెపై నుంచి విసిరేస్తున్న తల్లులు!

Afghanistan: తాలిబన్ల అరాచక పాలన నుంచి తప్పించుకునేందుకు ఆఫ్గాన్ పౌరులు చేయని ప్రయత్నం లేదు. విమానాశ్రయం లోపలికి వెళ్లకుండా ఇనుపకంచెలు అడ్డుపెట్టారు. దీంతో నిస్సహాయస్థితిలో ఉన్న ప్రజలు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. తమను కాపాడమంటూ ఎయిర్‌పోర్టులో ఉన్న యూఎస్‌, యూకే దళాలను వేడుకుంటున్నారు. కనీసం తమ తర్వాతి తరం వారినైనా రక్షించుకోవాలన్న ఆరాటంతో ఇనుప కంచెలపై నుంచి పిల్లలను లోపలికి విసిరేస్తోన్నారు తల్లులు. కనీసం తమ పిల్లలనైనా తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు చిన్నారులు కంచెలో చిక్కుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story