America: అమెరికాలో ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి

America: పరిమితికి మించిన వేగంతో వెళ్లడంతో ప్రమాదం

Shashank Gullapelli
Updated on: 27 April 2024 5:45 PM IST
Accident In America Three Indians Died
X

America: అమెరికాలో ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి

America: అమెరికాలోని సౌత్‌ కరోలినాలో చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు మృతిచెందారు. వారంతా గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన వారని స్థానిక అధికారులు తెలిపారు. మృతులు రేఖాబెన్ పటేల్‌, సంగీతాబెన్ పటేల్, మనీశాబెన్ పటేల్‌గా గుర్తించారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. దాని వల్లే వాహనం అదుపుతప్పి రహదారిపై పలుమార్లు పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి... చెట్లలో ఇరుక్కుపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరొకరికి గాయం కాగా... ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story