Japan PM: జపాన్ ప్రధానిపై బాంబు దాడి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..
Japan PM: జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
Japan PM: జపాన్ ప్రధానిపై బాంబు దాడి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..
Japan PM: జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమ వేదికకు సమీపంలో ఓ వ్యక్తి బాంబు విసిరాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయన్ను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఆయనకు ఎలాంటి హాని జరగలేదు. పశ్చిమ జపాన్ నగరమైన వాకయామాలో ప్రధాని కిషిడా ఫిషింగ్ హార్బరును పరిశీలించిన తర్వాత ప్రసంగిస్తుండగా బాంబు పేలుడు జరిగిందని జపాన్ అధికారులు చెప్పారు. బాంబు పేల్చిన వ్యక్తిని జపాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story




