Turkey: టర్కీని కుదిపేసిన భారీ భూకంపం

Turkey: రిక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదు

Dhatripriya
Published on: 6 Feb 2023 9:31 AM IST
A Huge Earthquake In Turkey
X

Turkey: టర్కీని కుదిపేసిన భారీ భూకంపం

Turkey: టర్కీ దేశాన్ని అతి భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.8గా నమోదైంది. భూకంప తీవ్రతకు కొన్ని భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. చాలా మంది చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ చర్యలు ముమ్మరమయ్యాయి. ఈ ఉదయం 6.47 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి. టర్కీతోపాటూ సిరియా, లెబనాన్, ఇరాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా, సైప్రస్ లోనూ భూమి కంపించింది. భూకంప కేంద్రం ఆగ్నేయంగా ఉన్న నర్దాగిలో ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియొలాజికల్ సర్వే గుర్తించింది. నర్దాగీకి 26 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చినట్లు అమెరికా సంస్థ USGS గుర్తించింది. ఈ నర్దాగి అనేది గజియాంటెప్ ప్రావిన్స్‌లోని జిల్లా, సిటీగా ఉంది. ఇది గజియాంటెప్‌కి పశ్చిమంగా 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమిలోపల 17.9 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినట్లు గుర్తించారు.

Dhatripriya

Dhatripriya

Next Story