Beer Bike: బీరుతో నడిచే బైక్‌.. పెట్రోల్ అవసరమే లేదు.. మైలేజ్ చూస్తే పరేషాన్ అవ్వాల్సిందే..!

Beer Motorcycle: బైక్ ప్రియులకు అతిపెద్ద సవాలు బైక్‌కు పెట్రోల్ పోయడం. బండి బయటకు తీయాలంటే పెట్రోల్ లేనిది కుదరదు.

Arun Chilukuri
Updated on: 16 May 2023 6:00 PM IST
A Bike That Runs on Beer No Need for Petrol Check This Beer Bike Price Features
X

Beer Bike: బీరుతో నడిచే బైక్‌.. పెట్రోల్ అవసరమే లేదు.. మైలేజ్ చూస్తే పరేషాన్ అవ్వాల్సిందే..!

Fuel Of Beer: బైక్ ప్రియులకు అతిపెద్ద సవాలు బైక్‌కు పెట్రోల్ పోయడం. బండి బయటకు తీయాలంటే పెట్రోల్ లేనిది కుదరదు. అయితే, అమెరికాకు చెందిన ఓ కుర్రాడు అద్భుతం చేశాడు. పెట్రోల్‌, డీజిల్‌ అవసరం లేని బైక్‌ని ఈ కుర్రాడు కనిపెట్టాడు. ఈ బైక్ బీరుతో మాత్రమే నడుస్తుంది. అంతే కాదు ఈ బైక్ మైలేజీని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.

పెట్రోల్ కాదు బీరుతో నడిచే బైక్..

ఈ అబ్బాయి అమెరికాలోని మిచిగాన్‌లో నివాసం ఉంటున్నాడు. ఆయన పేరు కే మైఖేల్సన్. అమెరికన్ మీడియా కథనాల ప్రకారం, ఈ వ్యక్తికి బైక్‌లు అంటే చాలా ఇష్టం. కొత్త బైక్‌లను కొనుగోలు చేస్తూనే ఉంటుంటాడు. కానీ, ఈసారి తనంతట తానుగా అద్భుతాలు చేశాడు. ఇది పెట్రోల్‌తో కాకుండా బీరుతో నడుస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ వ్యక్తికి స్వయంగా బీర్ అంటే ఇష్టం లేకపోయినా.. బీర్ వాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

నాజిల్‌లో సూపర్-హీటెడ్ ఆవిరి..

పెరుగుతున్న గ్యాస్, పెట్రోల్ ధరలను చూసి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది రెడ్‌బుల్, కారిబౌ కాఫీపై కూడా నడుస్తుంది. దాని పనితీరును వివరిస్తూ, దాని ఇంజిన్‌గా హీటింగ్ కాయిల్‌తో 14-గాలన్ కెగ్ ఉందని అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ కాయిల్ బీర్‌ను 300 డిగ్రీల వరకు వేడి చేస్తుంది. నాజిల్‌లో సూపర్-హీటెడ్ ఆవిరిని సృష్టిస్తుంది.

ఈ వ్యక్తి తన గ్యారేజీలో ఈ బైక్‌ను తయారు చేశాడు. బీర్‌తో నడిచే ఈ బైక్ వేగం గంటకు 150 మీ. అంతే కాకుండా పర్యావరణానికి, జేబుకు రెండింటికీ ఈ బైక్‌లు ఎంతో మేలు చేస్తాయని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి, ఈ బైక్, ఈ వ్యక్తికి సంబంధించిన కొన్ని ఫొటోలు తెరపైకి వచ్చాయి. ప్రజలు ఈ బైక్‌పై చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు. సోషల్ మీడియాలో జనాలు కూడా ఈ బైక్ గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story