Miss Universe: అందాల పోటీల్లో సరికొత్త సంచలనం.. 60 ఏళ్ల మహిళకు అందాల కిరీటం..!

A 60-Year-Old Woman Won The Buenos Aires Title
x

Miss Universe: అందాల పోటీల్లో సరికొత్త సంచలనం.. 60 ఏళ్ల మహిళకు అందాల కిరీటం..!

Highlights

Miss Universe: 60 ఏళ్ల వయస్సులో కిరీటం పొందిన మహిళగా రికార్డ్

Miss Universe: అందాల పోటీ అనగానే మొదట టీనేజ్ అమ్మాయిలే గుర్తుకువస్తారు. ఆ ఆలోచనలను పటాపంచలు చేస్తూ అర్జెంటీనాకు చెందిన అలెజాండ్రా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆరు పదుల వయసులో అందంతో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ ‘భామ’.. తాజాగా మిస్‌ యూనివర్స్‌ ప్రాతినిధ్యం కోసం జరుగుతున్న పోటీల్లో కిరీటం దక్కించుకున్నారు. అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో ఇటీవల అందాల పోటీలు జరిగాయి. ఇందులో 60 ఏళ్ల అలెజాండ్రా ‘మిస్‌ యూనివర్స్‌ బ్యూనస్‌ ఎయిర్స్‌ టైటిల్‌ గెలుచుకున్నారు. అందాల పోటీల్లో ఈ వయసులో కిరీటం పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఈ ఏడాది మే నెలలో జరగబోయే ‘మిస్‌ యూనివర్స్‌ అర్జెంటీనా’ పోటీల్లో ఈమె బ్యూనస్‌ ఎయిర్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories