Africa: ఆఫ్రికాలోని సియర్రాలియోన్‌లో భారీ పేలుడు

* ఇంధన ట్యాంకర్‌ పేలి 95 మంది మృతి * పలువురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు * ఇంధన ట్యాంకర్‌ను ట్రక్కు ఢీ కొనడంతో ఘటన

Shilpa
Published on: 6 Nov 2021 6:33 PM IST
95 People Killed due to Fuel Tanker Explosion at Sierra Leone in Africa
X

ఆఫ్రికాలోని సియర్రాలియోన్‌లో భారీ పేలుడు(ఫైల్ ఫోటో)

Africa: ఆఫ్రికాలో భారీ పేలుడు సంభవించింది. సియర్రాలియోన్‌లో ఇంధన ట్యాంకర్‌ పేలడంతో 95 మంది మృతి చెందారు. ఘటనలో పలువురికి తీవ్రగాయాలు కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇంధన ట్యాంకర్‌ను ట్రక్కు ఢీ కొట్టడంతోనే ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మొదట ఇంధన ట్యాంకర్‌ ప్రమాదానికి గురైంది. అయితే అందులోని ఇంధనం లీకవుతుండటంతో పలువురు అక్కడికి చేరుకుని దాన్ని సేకరించేయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆ ట్యాంకర్‌ ఒక్కసారిగా భారీ శబ్దం చేస్తూ పేలిపోయింది. దీంతో ఇంధనాన్ని సేకరించేవారు తునాతునకలయ్యారు.

Shilpa

Shilpa

Next Story