IRAQ: ఆక్సిజన్‌ ట్యాంక్‌ పేలి అగ్నిప్రమాదం.. 82కి చేరిన మృతులు

ఆక్సిజన్‌ ట్యాంక్‌ పేలి ఆస్పత్రిలో చెలరేగిన మంటలు

Samba Siva Rao
Published on: 25 April 2021 4:56 PM IST
Irag Fire Accident
X

ఇరాక్ 

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 82కి చేరింది. బాగ్దాద్‌లోని కోవిడ్‌ హాస్పిటల్‌లో ఆక్సిజన్‌ ట్యాంక్‌ పేలి మంటలు చెలరేగాయి. దీంతో ఐసీయూలోని 27 మంది కోవిడ్ పేషంట్లు అక్కడికక్కడే చనిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది మిగిలిన పేషంట్లను ఇతర హాస్పిటల్స్‌కు తరలించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరో 55 మంది మృతి చెందారు. ఆక్సిజన్‌ సరఫరా సమయంలో సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story