Coronavirus: ఎనిమిదేళ్ల క్రితమే కరోనాపై ట్వీట్.. సోష‌ల్ మీడియ‌లో వైరల్

Coronavirus: ఎనిమిదేళ్ల క్రితమే కరోనాపై ట్వీట్.. సోష‌ల్ మీడియ‌లో వైరల్
x
Highlights

Coronavirus: ట్విట్టర్‌ యూజర్‌ మార్కో అక్రోట్‌ అనే వ్యక్తి జూన్‌ 3, 2013న కరోనా వైరస్‌ వస్తుంది అంటూ ట్వీట్‌ చేశాడు

Coronavirus: క‌రోనా మ‌మ‌హ్మ‌రి గ‌త ఏడాది వ‌చ్చి ఇప్ప‌టీకి కూడా ప్ర‌పంచ వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త రూపాల‌ను సంత‌రించుకుంటూ ప్ర‌జల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతుంది. కరోనా రక్క‌సి ఎంద‌రినో పొట్ట‌న పెట్టుకుంటుంది. అయితే ఈ మ‌హమ్మారి దాటికి అన్ని రంగాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి. క‌రోనా పీడ ఎప్పుడు వీర‌గ‌డవుతుందా అని అంతా ఎందురుచూస్తున్నారు. ఈ మ‌హ‌మ్మారికి జ‌యంచ‌డానికి అన్ని దేశాలు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి. శాస్త్ర‌వేత్త‌లు టీకాలు క‌నిపెట్టే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే కొన్ని దేశాల్లో దీనికి నిలువ‌రించ‌డానికి కొన్ని టీకాలు కూడా వ‌చ్చాయి.

అయితే క‌రోనా వ‌స్తుంద‌ని, ఇది ఇంత విల‌యం సృష్టిస్తుంద‌ని ఎవ‌రైనా ముందే చెప్తే బాగుంటుంద‌ని, ఈ విష‌యం మన‌కు ముందే చెబితే పక్కాప్ర‌ణాళిక‌తో ఉండేవాళ్లం అంటూ అంద‌రూ అనుకుంటున్నారు. అయితే దీనిపై ఓ వ్య‌క్తి ఎనిమిదేళ్ళ క్రీత‌మే హెచ్చరించాడు. అత‌ను ఓ ట్వీట్ కూడా చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

పూర్తి వివ‌రాళ్లోకి వెళ్లే.. ట్విట్టర్‌ యూజర్‌ మార్కో అక్రోట్‌ అనే వ్యక్తి జూన్‌ 3, 2013న కరోనా వైరస్‌ వస్తుంది అంటూ ట్వీట్‌ చేశాడు. కరోనా వైరస్‌.. ఇట్స్‌ కమింగ్‌ అంటూ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం మరోసారి వైరల్ 8ఏళ్ల‌ క్రితమే నీవు కరోనాను ఎలా పసిగట్టగలిగావ్‌.. ''నువ్వు టైం ట్రావేలర్‌వా'' అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరూ ట్విట్టర్‌ను హ్యాక్‌ చేసి తేదీ మార్చి ఉంటాడ‌ని ట్వీట్ చేస్తున్నారు. క‌రోనాపై గ‌తంలో అనే వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. కాల‌జ్ఙానంలో బ్ర‌హ్మంగారు ముందే చెప్పార‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories