మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 73,770 పాజిటివ్ కేసులు.. 799 మృతి...

Coronavirus Live Updates: పరిస్థితులు ఇలాగే ఉంటే జూన్‌లో తెలంగాణలో ఫోర్త్ వేవ్..?

Shireesha
Published on: 23 April 2022 8:58 AM IST
73770 Coronavirus Positive Cases Recorded Today 23 04 2022 in America | Covid Latest News
X

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 73,770 పాజిటివ్ కేసులు.. 799 మృతి...

Coronavirus Live Updates: పలు దేశాల్లో మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. అమెరికాలో కొత్తగా 73వేల 770 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 799 కోవిడ్ బారిన పడి మృతి చెందారు. అటు చైనాలోని షాంఘైలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఇటు భారత్‌లోనూ రోజువారీ కేసులు 2వేలకుపైగా నమోదవుతున్నాయి.

తమిళనాడులో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఆ రాష్ట్ర సర్కార్ కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తుంది. ఇక పరిస్థితులు ఇలాగే కొనసాగితే తెలంగాణలో ఫోర్త్ వేవ్ కాయమని వైద్య నిపుణులు ‎భావిస్తున్నట్లు సమాచారం. దీంతో మాస్క్ తప్పనిసరంటూ రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేశాయి. మాస్క్ ధరించనివారికి జరిమానాలు కూడా విధిస్తున్నాయి.

Shireesha

Shireesha

Next Story