Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా బుసలు

Coronavirus: 57,44,21,319కు చేరిన మొత్తం కేసులు సంఖ్య

Rama Rao
Updated on: 24 July 2022 8:11 PM IST
7,04,813 New Corona Cases in World | Corona Cases
X

Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా బుసలు 

Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ బుసలు కొడుతోంది. పలు దేశాల్లో కోవిడ్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 7,04,813 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,029 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 57,44,21,319కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 64,02,173 మంది మరణించారు. ఒక్కరోజే 6,15,708 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 54,41,29,418కు చేరింది.

ఫ్రాన్స్​లో కొత్తగా 68,532 మందికి కరోనా సోకింది. జపాన్‌లో 1,96,297 కేసులు నమోదు కాగా 64 మంది చనిపోయారు. ఫ్రాన్స్‌లో కొత్తగా 68,532 మందికి కరోనా సోకింది. దక్షిణ కొరియాలో తాజాగా 68,521 కేసులు నమోదు కాగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో కొత్తగా 68,170 మందికి వైరస్​ సోకగా.. 116 మంది మరణించారు. ఆస్ట్రేలియాలో తాజాగా 44,890 మందికి వైరస్​ సోకగా 102 మంది చనిపోయారు.


Rama Rao

Rama Rao

Next Story