Taiwan: 6.1 తీవ్రతతో తైవాన్‌లో భూకంపం!

Taiwan: భూకంపం కారణంగా రాజధాని తైపీలో ఊగిన భవనాలు

Shashank Gullapelli
Published on: 27 April 2024 11:09 AM IST
6.1 Earthquake In Taiwan
X

Taiwan: 6.1 తీవ్రతతో తైవాన్‌లో భూకంపం!

Taiwan: తైవాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 భూకంప తీవ్రత నమోదైంది. రాజధాని తైపీలోని పలు భవనాలు భూప్రకంపనలకు ఊగాయి. భూకంప కేంద్రం 24.9 కిలోమీటర్ల లోతున ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే.. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే, ఈ నెల మొదట్లో తైవాన్‌ను 7.2 తీవ్రత కలిగిన భూకంపం కుదిపేసింది. అప్పట్లో 17 మంది కన్నుమూశారు. నాటి నుంచి ఇప్పటివరకూ అక్కడ సుమారు వెయ్యి సార్లు భూమి కంపించిందని అధికారులు తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story