Goldmine Collapsed: బంగారు గని కుప్పకూలి 48 మంది మృతి

Pavan Reddy
Published on: 16 Feb 2025 5:48 PM IST
48 people killed in Goldmine Collapse In Mali of Africa, Gold mining in africa
X

Goldmine Collapsed: బంగారు గని కుప్పకూలి 48 మంది మృతి

Goldmine Collapsed: బంగారు గని కుప్పకూలిన ఘటనలో 48 మంది మృతి చెందారు. ఆఫ్రికాలోని మాలిలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఆఫ్రికాలో ఎక్కువగా గోల్డ్ మైన్స్ ఉన్న ప్రాంతం మాలినే. ఇక్కడ అనేక ప్రాంతాల్లో అక్రమంగానూ బంగారు గనుల తవ్వకాలు జరుగుతుంటాయి అని స్థానిక అధికారులు చెప్పినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థ ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్ వెల్లడించింది.

శనివారం కూలిపోయిన గోల్డ్ మైన్స్ కూడా అక్రమంగా జరుగుతున్న మైనింగ్ గానే అధికారులు గుర్తించారు. అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ అక్రమ మైనింగ్‌కు మాత్రం అడ్డు కట్ట వేయలేకపోతున్నారు. ఈ ప్రమాదంలో 48 మంది చనిపోయినట్లుగా స్థానిక కెనీబా గోల్డ్ మైనర్స్ అసోసియేషన్ నిర్ధారించింది.

ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Pavan Reddy

Pavan Reddy

Next Story