కరోనా క్లస్టర్ గా వాల్డ్ బిగ్గెస్ట్ క్రూయీజ్ షిప్.. నౌకలో ప్రయాణిస్తున్న 48 మందికి వైరస్

48 Test Positive for Covid on Worlds Biggest Cruise Ship
x

కరోనా క్లస్టర్ గా మారిన అతిపెద్ద నౌక.. మియామీ పోర్టులో నిలిపి ఉంచిన నౌక(ఫైల్-ఫోటో)

Highlights

Cruise ship: నౌకలో 48 మందికి సోకిన కరోనా ఒమిక్రానా కాదా అన్నదానిపై తేలని సస్పెన్స్

Cruise ship: ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్‌ నౌక 'ది రాయల్‌ కరేబియన్‌ సింఫనీ ఆఫ్‌ సీస్‌' ఇప్పుడు కరోనా క్లస్టర్‌గా మారింది. ఈ నౌకలో ప్రయాణిస్తున్న 48 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. 6వేల మందికి పైగా ప్రయాణిస్తున్న ఈ నౌకను ప్రస్తుతం ఫ్లోరిడాలోని మియామీ పోర్ట్‌లో నిలిపి ఉంచారు. రెండు రోజుల క్రితం నౌకలో ఓ ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమెకు వైద్య పరీక్షలు జరిపారు.

గొంతునొప్పితో పాటు విపరీతమైన దగ్గు రావడంతో పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆమెతో దగ్గరగా ఉన్న వ్యక్తులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా 48 మందికి పాజిటివ్‌గా తేలినట్లు నౌక యాజమాన్య సంస్థ ది రాయల్‌ కరేబియన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే వీరికి సోకింది ఒమిక్రాన్‌ వేరియంటా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories