Afghanistan: కొరకరాని కొయ్యగా పంజ్‌షీర్.. నిన్న ఒక్కరాత్రే 350 మంది తాలిబన్ల హతం!

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు పంజ్ షీర్ మాత్రం కొరకరాని కొయ్యగా తయారైంది.

Arun Chilukuri
Published on: 1 Sept 2021 9:02 PM IST
350 Taliban Terrorists Killed By NRF In Panjshir Valley
X

Afghanistan: కొరకరాని కొయ్యగా పంజ్‌షీర్.. నిన్న ఒక్కరాత్రే 350 మంది తాలిబన్ల హతం!

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు పంజ్ షీర్ మాత్రం కొరకరాని కొయ్యగా తయారైంది. ఆక్రమించేందుకు తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలను పంజ్ షీర్ యోధులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నిన్న రాత్రి పంజ్ షీర్ ప్రావిన్స్ లోని ఖవక్ లో జరిగిన హోరాహోరీలో 350 మంది తాలిబన్లు హతమైనట్టు పంజ్ షీర్ పోరాట దళంలోని నార్తర్న్ అలయన్స్ ప్రకటించింది.

మరో 40 మందిని బందీలుగా పట్టుకున్నామని వెల్లడించింది. వారి నుంచి అనేక అత్యాధునికమైన అమెరికా ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. కమాండర్ మునీబ్ అమీరి ఆధ్వర్యంలో తిరుగుబాటు చేశామని తెలిపింది. మరోవైపు పంజ్ షీర్ ను ఆక్రమించేందుకు తాలిబన్లు అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నారు. తాజాగా గుల్బహర్ నుంచి ఇవాళ దాడులు చేశారు. అయితే, పంజ్ షీర్ పోరాట దళాలు వాటిని తిప్పికొడుతున్నాయి. గుల్బహర్ లోకి ఎవరూ రాకుండా తాలిబన్లు కంటైనర్‌తో రోడ్డును బ్లాక్ చేశారు. ఇప్పుడు అక్కడ రెండు వర్గాల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story