బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. నౌకలో అగ్నిప్రమాదం.. 32 మంది సజీవదహనం...

Bangladesh - Ship Fire Accident: *ప్రాణాలు కాపాడుకునేందుకు నదిలో దూకిన జనం *ఢాకా నుంచి బరుంగా వెళ్తున్న భారీ షిప్

Shireesha
Published on: 24 Dec 2021 12:14 PM IST
32 Dead in Ferry Fire Accident in Bangladesh Today 24 12 2021 | International News
X

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. నౌకలో అగ్నిప్రమాదం.. 32 మంది సజీవదహనం...

Bangladesh - Ship Fire Accident: బంగ్లాదేశ్‌ దేశంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నౌకలో మంటలు చెలరేగడంతో 32 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఝలోకఠి ప్రాంతంలోని సుగంధ నదిపై ఈ ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా నుంచి బరుంగా వెళ్తున్న ఓ మూడంతస్తుల ప్రయాణికుల నౌకలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.

నౌకలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు నదిలోకి దూకారు. మంటల్లో చిక్కుకుని 32 మంది సజీవదహనమైనట్లు అధికారులు తెలిపారు. మరికొందరు గాయపడగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

Shireesha

Shireesha

Next Story