చైనాలోని యిన్‌చువాన్‌లోని ఒక రెస్టారెంట్‌లో గ్యాస్ లీక్.. 31 మంది మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

China: గాజు పెంకులు గుచ్చుకొని పలువురు మృతి

Jyothi
Published on: 22 Jun 2023 9:19 AM IST
31 Killed After gas Leak Sets Of Explosion In China Restaurant
X

చైనాలోని యిన్‌చువాన్‌లోని ఒక రెస్టారెంట్‌లో గ్యాస్ లీక్.. 31 మంది మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు 

China: చైనాలో ఘోర ప్రమాదం సంభవించింది. వాయువ్య చైనాలోని యిన్‌చువాన్‌లోని ఒక రెస్టారెంట్‌లో గ్యాస్ లీక్ కారణంగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 31 మంది మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ పేలుడు సంభవించడంతో రెస్టారెంట్ అద్దాలు పగిలిపోయాయి. దీంతో పలువురు గాజు పెంకులు గుచ్చుకుని మరణించినట్లు తెలుస్తోంది.

రాత్రి 8 గంటలా 40 గంటల సమయంలో పేలుడు జరినట్లు చైనా అధికారిక మీడియా జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. నింగ్జియా హుయ్ అటానమస్ రీజియన్ రాజధానిలో రద్దీగా ఉండే వీధిలో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. సెలవుదినం కావడంతో రెస్టారెంట్‌ రద్దీగా ఉన్నట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ వివరించింది. పేలుడు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది చేరుకుని... 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.

Jyothi

Jyothi

Next Story