Earthquake: హైతీలో భారీ భూకంపం

Earthquake: హైతీలో 7.2 తీవ్రతతో భూకంపం * 304 చేరిన మృతుల సంఖ్య

Sandeep Eggoju
Published on: 15 Aug 2021 10:49 AM IST
304 People Died in Haiti due to Heavy Earthquake
X
హైతీ లో భారీ భూకంపం (ఫైల్ ఇమేజ్)

Earthquake: కరీబియన్ దేశమైన హైతీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే చెప్పింది. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటివరకు 304 మంది మృతి చెందినట్టు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొదట సునామీ హెచ్చరికలు జారీ చేసిన యూఎస్ జియోలాజికల్ సర్వే అనంతరం ఉపసంహరించుకుంది. రాజధాని నగరం పోర్ట్-ఓ-ప్రిన్స్ కు 125 కి.మీ దూరంలో, పశ్చిమ హైతీలోని సెయింట్ లూయిస్-డు- సుడ్‌కు 12 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story