Mexico: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 27 మంది మృతి.. 17 మందికి గాయాలు

Mexico: గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమం

Shekhar G
Published on: 6 July 2023 10:46 AM IST
27 Died 17 Injured In Passenger Bus Accident In Mexico
X

Mexico: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 27 మంది మృతి.. 17 మందికి గాయాలు 

Mexico Bus Accident: మెక్సికో దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 27 మంది మరణించారని పోలీసులు తెలిపారు. దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్వత ప్రాంతం గుండా బస్సు వెళ్తున్న సమయంలో లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ ప్రమాదంలో 17 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి మెకానికల్ వైఫల్యమే కారణం అని అనుమానిస్తున్నారు.

గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. పర్వతాలు, మలుపులు ఉంటే రియోట్ ప్రాంతం అయిన మాగ్డలీన పెనాస్కో పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ బస్సు రాత్రి రాజధాని మెక్సికో సిటీ నుండి బయలుదేరి శాంటియాగో డి యోసోండువా పట్టణానికి వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని.. దీంతో 25 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయిందని రాష్ట్ర అధికారి తెలిపారు. బస్సు నడుపుతున్న సంస్థ మెక్సికో సిటీ నుంచి రోజూవారీ సేవలు అందిస్తుందని అతను తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story