అమెరికా ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ..ఇప్పటివరకు 45 రాష్ట్రాల ఫలితాలు వెల్లడి

Arun Chilukuri
Published on: 5 Nov 2020 7:31 AM IST
అమెరికా ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ..ఇప్పటివరకు 45 రాష్ట్రాల ఫలితాలు వెల్లడి
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కౌంటింగ్ చివరి దశకు చేరుకున్నా ఇప్పటివరకు అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 45 రాష్ట్రాల్లో కౌంటింగ్ పూర్తైంది. మరో ఐదు రాష్ట్రాల కౌంటింగ్ కొనసాగుతుండగా ట్రంప్, బైడెన్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది.

నిన్న స్వింగ్ స్టేట్స్‌లో కనిపించిన ట్రంప్ హవా తగ్గింది. మిచిగాన్‌, విస్కాన్సిన్‌ రాష్ట్రాలను బైడెన్‌ కైవసం చేసుకున్నారు. మిగిలిన ఐదు రాష్ట్రాల్లో నార్త్ కరోలినా, జార్జియా,పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యం కనిపిస్తుండగా అరిజోనా, నెవాడాలో బైడెన్ ఆధిక్యంలోకి వచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story