కరోనా ఉగ్రరూపం : ఒక్కరోజులో లక్షా 80 వేల కేసులు..!

కరోనా ఉగ్రరూపం : ఒక్కరోజులో లక్షా 80 వేల కేసులు..!
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు భారీగా పెరుగుతున్న కరోనా...

ప్రపంచవ్యాప్తంగా‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు భారీగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య . శనివారం ఆదివారం మధ్య 24 గంటల వ్యవధిలో ఏకంగా లక్షా 83 వేల కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఒక్క రోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వీటిలో 54,771 కేసులతో బ్రెజిల్‌ ప్రథమ స్థానంలో ఉండగా.. 36,617 కేసులతో అమెరికా రెండో స్థానంలో, 15,400 కేసులతో భారత్‌ మూడో స్థానంలో ఉంది.

టెస్టుల సంఖ్య పెరగడం, అధిక సంఖ్యలో వైరస్‌ వ్యాప్తి చెందడం వల్ల ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత 24 గంటల్లో నమోదయిన కేసులతో కలుపుకుని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల సంఖ్య 87,08,008కు చేరగా.. నిన్న సంభవించిన 4,743 మరణాలతో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 4,61,715కు చేరింది. నిన్నటి మరణాల్లో రెండింట మూడొంతుల మరణాలు అమెరికాలోనే, ప్రపంచవ్యాప్తంగా నమోదయిన కరోనా కేసులు, మరణాల సంఖ్యలో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు అమెరికాలో 2.2 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 1,20,000 మరణాలు. కరోనా వైరస్ బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలతో పాటు మరీ ముఖ్యంగా లాటిన్ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories