Americans Kidnap: కరీబియన్ కంట్రీ హైతీలో అమెరికన్ల కిడ్నాప్

17 American Missionaries Kidnapped in Haiti Caribbean Country
x

కరీబియన్ కంట్రీ హైతీలో అమెరికన్ల కిడ్నాప్(ఫైల్ ఫోటో)

Highlights

*17 మందిని కిడ్నాప్ చేసిన మావోజో ముఠా *విడుదల చేయాలంటే ఒక్కొక్కరికి ఒక మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్

Americans Kidnap: కరీబియన్‌ కంట్రీ హైతీలో అమెరికన్ల కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. 17 మంది అమెరికా మిషనరీలను మావోజో అనే రౌడీ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. తీవ్ర కరువులో ఉన్న హైతీలో అమెరికాకు చెందిన ఓ మిషనరీ సంస్థ సేవలందిస్తోంది. హైతీ రాజధాని పోర్టౌ ప్రిన్స్‌లోని ఓ అనాథాశ్రమం దగ్గర ఇలా సేవలందిస్తుండగా ఒక్కసారిగా మావోజో ముఠా సభ్యులు కిడ్నాప్ చేశారు.

తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే కిడ్నాప్ చేసిన 17 మందిని హతమారుస్తామని హెచ్చరిస్తూ ముఠా నాయకుడు విల్సన్ జోసెఫ్ ఓ వీడియో విడుదల చేశాడు. హైతీ ప్రధాని సహా పోలీసు చీఫ్‌ను బెదిరించాడు. 17 మందిని విడుదల చేయాలంటే ఒక్కొక్కరికి 1 మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories