Road Accidents: నెత్తరోడిన రహదారులు..16 మంది దుర్మరణం
Road Accidents: నెత్తరోడిన రహదారులు..16 మంది దుర్మరణం
Road Accidents: పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 16 మంది దుర్మరణం పాలయ్యారు. మర 45 మందికి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. సింధ్ ప్రావిన్స్ లోని ఖైర్పూర్ సమీపంలోని రాణిపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. 35 మందికి గాయాలయ్యాయి.బురేవాలా నుంచి వస్తున్న బస్సు జాతీయ రహదారిపై రిక్షాను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.
అలాగే షహీద్ బెనజీరాబాద్ జిల్లాలోని ఖాజీ అహ్మద్ పట్టణం సమీపంలో మరో ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ ట్రలర్ ను ఢీకొట్టడంతో ఐదుగురు మరణించారు. 10 మందికి గాయాలయ్యాయి. వేగంగా ప్రయాణిస్తున్న వ్యాను తొలుత గాడిద బండిని ఢీకొట్టి ఆ తర్వాత ఎదురుగా వస్తున్నట్రయిలర్ ను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.




