మహబూబ్‌నగర్‌లో గెలుపెవరిది?

మహబూబ్‌నగర్‌లో గెలుపెవరిది?
x
Highlights

మహబూబ్‍నగర్ పార్లమెంట్‍ నియోజకవర్గంలో ప్రతీసారీ పోటీ రసవత్తరంగా కొనసాగుతూ వస్తుంది. జనరల్ స్థానమైన మహబూబ్‍నగర్ పార్లమెంటు నుంచి రాష్ట్ర, జాతీయ...

మహబూబ్‍నగర్ పార్లమెంట్‍ నియోజకవర్గంలో ప్రతీసారీ పోటీ రసవత్తరంగా కొనసాగుతూ వస్తుంది. జనరల్ స్థానమైన మహబూబ్‍నగర్ పార్లమెంటు నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు బరిలో నిలుస్తుండటంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంది. 2009లో ప్రస్తుత సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాదు తాను ఎంపీగా ఉండి తెలంగాణ సాధించానని కేసీఆర్‌ చెబుతుండటంతో పాలమూరు పార్లమెంట్‍ స్థానం తెలంగాణాలో ఓ ప్రత్యేక గుర్తింపును పొందింది.

ఉమ్మడి రాష్ట్రంలో వెనకబడ్డ జిల్లాగా గుర్తింపు పొందిన ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాలో మహబూబ్‍నగర్ పార్లమెంట్‍ స్థానానికి 2009లో పోటీ చేసిన ప్రస్తుత సీఎం కేసీఆర్ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో.. ఆయన్ను ఓడించేందుకు అప్పటి సర్కార్‌ సర్వశక్తులు ఒడ్డిందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాష్ట్రంలోని రాజకీయ నాయకులందరూ 2009 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో మహబూబ్‍నగర్ పార్లమెంట్‍ వైపు చూశారు. అప్పటి నుంచి మహబూబ్‍నగర్ పార్లమెంట్‍‌లో రసవత్తర పోటీ కొనసాగుతూ వస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి దేవరకొండ విఠల్‍‌రావుపై ఉద్యమ నాయకుడిగా పోటీ చేసిన కేసీఆర్.... 20,184 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మహబూబ్‍నగర్ ఎంపీ హోదాలోనే ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.

వాయిస్6: ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌‍, టీఆర్‌ఎస్‌ మధ్యే పోటీ రసవత్తరంగా కొనసాగింది. మహబూబ్‍నగర్ పార్లమెంట్‍ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ తరపున జితేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి జైపాల్‍‌రెడ్డి బీజేపీ నుంచి నాగం జనార్దన్‌రెడ్డి పోటీ చేశారు. ఇందులో జితేందర్‌రెడ్డి... జైపాల్‍‌రెడ్డిపై 2,590 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించగా నాగం మూడో స్థానానికి పరిమితమయ్యారు. టీఆర్ఎస్‌కు 3లక్షల 34 వేల 228 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 3లక్షల 31 వేల 638 ఓట్లు పోలయ్యాయి.

మహబూబ్‍నగర్ పార్లమెంట్‍ సెగ్మెంట్‍‌లో జడ్చర్ల, కొడంగల్‍, మక్తల్‍, నారాయణపేట, దేవరకద్ర, షాద్‌నగర్‌తో పాటు మహబూబ్‍నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రస్తుతం మహబూబ్‍నగర్ ఎంపీగా కొనసాగుతున్న జితేందర్‌రెడ్డి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. 1999లో బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ నుంచి బరిలోకి దిగిన జితేందర్‌రెడ్డి... కాంగ్రెస్‌ అభ్యర్థి డి. మల్లికార్జున్‌పై విజయం సాధించారు. ఇక 2009లో టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ మహబూబ్‍నగర్‌ నుంచి పోటీకి దిగడంతో జితేందర్‌రెడ్డి చేవెళ్ల నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు.

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‍ స్థానం ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో తాజా ఓటర్ల జాబితా ప్రకారం 15,01,993 మంది ఓటర్లు ఉన్నారు. 2014లో 72.94 శాతం పోలింగ్‍ నమోదు కాగా 2009లో 67.68 శాతం నమోదైంది. ఈసారి ఓటింగ్ శాతంపైనే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. మహబూబ్‍నగర్ పార్లమెంట్‍ నుంచి ఇప్పటి దాక అత్యధికంగా కాంగ్ర్రెస్ పార్టీనే జెండా ఎగరవేయగా.. పోటీ చేసిన రెండుసార్లు గులాబీ పార్టీ విజయం సాధించింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలవడంతో మహబూబ్‍నగర్ పార్లమెంట్‍ స్థానంపై ఈసారి జెండా ఎగరేసి హ్యాట్రిక్‌ సాధించాలన్న పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ కూడా తమ ఓటు బ్యాంకును కాపాడుకుని, విజయం సాదించాలని చూస్తుంది. మరి పాలమూరు పార్లమెంట్‍ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే..

Show Full Article
Print Article
Next Story
More Stories