మేనక వార్నింగుల వెనక మర్మమేంటి?

మేనక వార్నింగుల వెనక మర్మమేంటి?
x
Highlights

యూపీలో ప్రచారం హద్దులు దాటుతోంది. గెలుపు కోసం నేతలు గీత దాటేస్తున్నారు. ఇష్టాను సారం ఓటర్లకు సుతిమెత్తని హెచ్చరికలు కూడా చేసేస్తున్నారు.. బీజేపీలో...

యూపీలో ప్రచారం హద్దులు దాటుతోంది. గెలుపు కోసం నేతలు గీత దాటేస్తున్నారు. ఇష్టాను సారం ఓటర్లకు సుతిమెత్తని హెచ్చరికలు కూడా చేసేస్తున్నారు.. బీజేపీలో మంచి మంత్రిగా, సమర్ధురాలిగా పేరుపడ్డ మేనకాగాంధీ తన ప్రచార పర్వంలో సరికొత్త దుమారానికి తెర తీశారు మేనక ఎందుకిలా చేశారు?

యూపీలో ఎన్నికల యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటర్లను ఆకట్టుకోడానికి ఉచితాలు, హామీలు దాటేసి ఇప్పుడు బెదిరింపులు, వార్నింగుల వరకూ ప్రచారాలు చేరిపోతున్నాయ్..సౌమ్యురాలిగా, సమర్ధనేతగా గుర్తింపు తెచ్చుకున్న ఇందిర చిన్న కోడలు ప్రచారంలో ఒక్కసారిగా కొత్త వ్యూహం అమలు చేస్తున్నారా? వినయంగా ఓట్లడిగే రోజులు పోయాయనుకున్నారా? అందుకే బెదిరించి ఓటడుగుతున్నారా? మేనక వార్నింగుల వెనక మర్మమేంటి?

బీజేపీ మంత్రి, అందరికీ చిరపరిచితురాలైన మేనకాగాంధీ ప్రచారంలో ఒక్క సారిగా దూకుడు పెంచారు. ఎన్నికల ముందు ఓట్ల పోలరైజేషన్ కు తెర తీశారు. మేనకకు మంచి వాగ్ధాటి ఉంది. ఆకట్టుకునే రూపం ఉంది. ఇందిర కోడలన్న చరిష్మా ఉంది. అన్నింటికీ మించి బీజేపీలో సమర్ధవంతమైన మంత్రిగా గుర్తింపు ఉంది. అయినా ఈసారి ఆమె ఎందుకో ప్రచారంలో తడబడుతున్నారు. పదిరోజుల నుంచి సుల్తాన్ పూర్ లో మాటేసిన మేనక ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తున్నారు. సమాయనుకూలంగా మాట్లాడటంలో ఆమె దిట్ట. 20 % మైనారిటీలున్న సుల్తాన్ పూర్ లో వారి ఓట్లను రాబట్టుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.. ఈ క్రమంలోనే కొంత శృతి మించారు. మైనారిటీల ఓట్లు మహా ఘటబంధన్ కు పడతాయేమోనన్న భయంతో ఆమె మాట తూలారు..

ముస్లింలంతా తనకు ఓటు వేయాలని లేని పక్షంలో వారి డిమాండ్లను , అవసరాలను తాను తీర్చలేకపోవచ్చని సున్నితంగా హెచ్చరించారు. ఈ ఎన్నిక తానెప్పుడో గెలిచేశానని.. ఇక ముస్లింలే నిర్ణయించుకోవాలనీ అన్నారు. తన గెలుపు ఖాయమేనని కానీ ముస్లింల ప్రమేయం అందులో లేకపోతే అది గెలుపుగా అనిపించుకోదనీ అన్నారు మేనక.. ప్రేమైనా, సంతోషమైనా ఇచ్చి పుచ్చుకోవాలని ఆమె అన్నారు.ప్రతీ ఎన్నికల్లోనూ తాను అన్ని వర్గాలకూ ప్రేమను పంచుతూనే ఉన్నానని కానీ ఈ ఎన్నికల్లో గెలుపులో అందరి ప్రమేయం ఉండాలని కోరుకుంటున్నట్లు మేనక తెలిపారు.

ఈ ఎన్నికల్లో ముస్లింలు తనకు ఓటు వేయడం ద్వారా ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ తొలగించాలన్నారు. ముస్లింలు అరకొరగా ఓట్లు వేసి ఏవైనా పనుల కోసం తన దగ్గరకొస్తే తాను మనస్ఫూర్తిగా పని చేయలేకపోవచ్చని సంకేతాలిచ్చారు.. అందుకే అంతా తనకు ఓటేయాలని మేనక కోరారు. సుల్తాన్ పూర్ లో ఫలితాల రోజు వంద శాతం ఓట్లు పడినదీ లేనిది తెలుసుకుంటానని.. ముస్లింల ఓట్లు పడకపోతే వారి పనులు చేసేది లేదని అన్నారు.తమ సంజయ్ విచార్ మంచ్ ఫౌండేషన్ ఈ ప్రాంతానికి వెయ్యి కోట్లు ఖర్చు చేసిందని, అయినా బీజేపీకి ఓటు వేయకపోతే ఎలా అంటూ నిలదీశారు. దాదాపు పది రోజుల నుంచి ఈ నియోజక వర్గంలో గడప గడపకు ఆమె తిరుగుతున్నారు. ప్రస్తుతం ఈ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్ గాంధీ 2009లో తాను గెలచిన ఫిలిబిత్ సీటుకు మారారు.. ఫిలిబిత్ సీటును మేనకగాంధీ ఇప్పటి వరకూ ఆరుసార్లు గెలిచారు.

ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలపై పంచ్ లు వేసే మేనక తోటి కోడలు సోనియా కుటుంబం ప్రస్తావన మాత్రం తేవడం లేదు.. బీఎస్పీ అధినేత్రి మాయావతి సీట్లు అమ్ముకుంటున్నారని ఒక్కో సీటును15 నుంచి 20 కోట్లకు అమ్ముకుంటున్నారని తెలిపారు. మాయావతికి 77 భవనాలున్నాయని అందులో ఉండేవారంతా ఆమె టిక్కెట్లను అమ్ముకుంటోందనే చెబుతున్నారని మేనక ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories