క్రీడా రణరంగంగా హస్తిన: ఓ వైపు క్రికెటర్..మరోవైపు బాక్సర్

క్రీడా రణరంగంగా హస్తిన: ఓ వైపు క్రికెటర్..మరోవైపు బాక్సర్
x
Highlights

భారత సార్వత్రిక ఎన్నికల బరిలో మరో క్రీడాదిగ్గజం అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. అమెచ్యూర్, ప్రొఫెషనల్ బాక్సింగ్ విభాగాలలో భారత్ కు అంతర్జాతీయ ఖ్యాతి...

భారత సార్వత్రిక ఎన్నికల బరిలో మరో క్రీడాదిగ్గజం అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. అమెచ్యూర్, ప్రొఫెషనల్ బాక్సింగ్ విభాగాలలో భారత్ కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన విజేందర్ సింగ్. సౌత్ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి ముక్కోణపు సమరానికి సై అంటున్నాడు. భారత రాజకీయాలలో కొత్తగాలి వీస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో వివిధపార్టీలు క్రీడాదిగ్గజాలవైపు చూస్తుంటే క్రీడాదిగ్గజాలు సైతం రాజకీయపార్టీల వైపు చూస్తున్నారు.అంతర్జాతీయస్థాయిలో క్రీడాకారులుగా విజయవంతమైన బాక్సర్ విజేందర్ సింగ్, క్రికెటర్ గౌతం గంభీర్ మాత్రమే కాదు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య, సోదరి, తండ్రి సైతం రాజకీయ అరంగేట్రానికి తహతహలాడుతున్నారు.

భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలను తన రెండో ఇన్నింగ్స్ గా మలచుకొన్నాడు. బీజెపీ తీర్థం పుచ్చుకొని మరీ ప్రతిష్టాత్మక న్యూఢిల్లీ లోక్ సభ స్థానం టికెట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరోవైపు.అమెచ్యూర్, ప్రొఫెషనల్ బాక్సింగ్ విభాగాలలో భారత ఆల్ టైమ్ గ్రేట్ స్టార్ విజేందర్ సింగ్ 33 ఏళ్ల వయసులోనే బాక్సింగ్ రింగ్ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలోకి దూకుతున్నాడు. దక్షిణ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి విజేందర్ సింగ్ ముక్కోణపు సమరంలో తన అదృష్టం పరీక్షించుకోన్నాడు.

ఇక టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా కొద్ది రోజుల క్రితమే బీజెపీ పార్టీలో అధికారికంగా చేరింది. అయితే రాజ్ కోట లోక్ సభ సీటు కోసం ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. అంతేకాదు జడేజా తండ్రి, సోదరి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు. రాజస్థాన్ లోని లోక్ సభ స్థానాల నుంచి ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ బీజెపీ తరపున, ఆసియాక్రీడల మెడలిస్ట్ కృష్ణపూనియా ఇప్పటికే పోటీకి దిగారు.మొత్తం మీద విశ్వవిఖ్యాత క్రీడాకారులు సైతం రాజకీయాల వైపు చూడటం రాజకీయాలను తమ కెరియర్ గా ఎంచుకోవాలని చూడటం ఆహ్వానించదగ్గ పరిణామమే.

Show Full Article
Print Article
Next Story
More Stories