టీడీపీకి టీఆర్ఎస్‌ రిటర్న్‌గిఫ్ట్‌ ఇదేనా?

టీడీపీకి టీఆర్ఎస్‌ రిటర్న్‌గిఫ్ట్‌ ఇదేనా?
x
Highlights

మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు గిఫ్ట్ తీసుకెళ్తుంటాం. తిరిగి వచ్చేటప్పుడు వారిచ్చే రిటర్న్ గిఫ్ట్ తీసుకొని వస్తుంటాం. తెలంగాణలో ఇటీవల జరిగిన్న...

మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు గిఫ్ట్ తీసుకెళ్తుంటాం. తిరిగి వచ్చేటప్పుడు వారిచ్చే రిటర్న్ గిఫ్ట్ తీసుకొని వస్తుంటాం. తెలంగాణలో ఇటీవల జరిగిన్న ఎన్నికలు ఈ సంప్రదాయాన్ని పార్టీలకూ విస్తరింపజేశాయి. తెలుగుదేశం పార్టీకి తాము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.మరి ఈ రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుంది ? ఎలాంటి మార్గం అనుసరిస్తారు? ప్రత్యక్ష పొత్తు ఉంటుందా? పరోక్ష అవగాహన ఉంటుందా ? ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా మాత్రమే మద్దతు ఉంటుందా? చంద్రబాబు ఓడించే లక్ష్యంతోనే అవగాహన కుదురుతుందా? రెండు రాష్ట్రాల ప్రయోజనాల మధ్య వైరుధ్యాలు ఉన్న నేపథ్యంలో ప్రజల స్పందన ఎలా ఉంటుంది? ఆ రెండు పార్టీల అవగాహన వైసీపీకి మేలు చేస్తుందా ? చేటు తెస్తుందా? టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అవగాహన జాతీయ రాజకీయాలకే పరిమితమవుతుందా ? రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల సాధనకూ తోడ్పడుతుందా?

టీడీపికి రిటర్న్ గిఫ్ట్ ను అందించేందుకు టీఆర్ఎస్ అనుసరించే వ్యూహంపై ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనే గాకుండా జాతీయ స్థాయిలోనూ ఆసక్తి నెలకొంది. జాతీయస్థాయి పార్టీలు సైతం ఈ పరిణామాలను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాయి. అందుకు ఎన్నెన్నో కారణాలున్నాయి. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలుచుకునే పార్టీలు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అవకాశం ఏర్పడుతుంది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటుతో తెలుగుదేశం రెండు సార్లు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు కూడా అలాంటి అవకాశం తెలుగు రాష్ట్రాలకు రానుందా ? ఇక్కడి పార్టీలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పనున్నాయా? లాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి రెకెత్తిస్తున్నాయి.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు కీలకపాత్ర పోషించడం కొత్తేమీ కాదు. యూపీయే 1 ప్రభుత్వ హయాంలో వామపక్ష కూటమి ఆ ప్రభుత్వాన్ని బయటి నుంచి నియంత్రించగలిగింది. ఇక నేషనల్ ఫ్రంట్ విషయం చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు నేషనల్ ఫ్రంట్ తరఫున జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అలాంటి సందర్భం ఇప్పుడు మరోసారి జాతీయ రాజకీయాల్లో ఏర్పడే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఆలోచనతో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories