తాజ్‌ గోడల్లో వజ్రాలు, పచ్చలు, రంగురాళ్ళు ఉన్నాయా?

Highlights

నాడు ఆగ్రాను పాలిస్తున్న రాజ్‌పుత్‌ రాజు, రాజా జైసింగ్ నుంచి షాజహాన్, తాజ్ మహల్ అనే మందిరాన్ని తీసుకున్నాడు లేదా ఆక్రమించుకున్నాడని కొందరు...

నాడు ఆగ్రాను పాలిస్తున్న రాజ్‌పుత్‌ రాజు, రాజా జైసింగ్ నుంచి షాజహాన్, తాజ్ మహల్ అనే మందిరాన్ని తీసుకున్నాడు లేదా ఆక్రమించుకున్నాడని కొందరు చరిత్రకారులు చెబుతారు. షాజహాన్ ఈ మందిరాన్నే ఎందుకు ఎంచుకున్నాడో చెప్పడానికి, వారు చాలా విషయాలు విశ్లేషిస్తున్నారు.తేజోమహాలయలోని శివుని గర్భగుడి ప్రాంతం బంగారంతోను, గోడల్లో వెలుతురు కోసం వజ్రాలు, పచ్చలు, రంగురాళ్ళు పొదగబడి ఉన్నాయి. అందుకే ఆ మందిరాన్ని తన భార్య సమాధికోసం ఎంచుకున్నాడు. షాజహాన్ తన భార్య ముంతాజ్‌ను మరువలేక, తన ప్రేమకు చిహ్నంగా దీన్ని నిర్మించాడని చరిత్రలో రాశారు. కానీ ముంతాజ్ అని పిలిచే, అర్జుమంద్ భానును, షాజహాన్ 1612లో వివాహం చేసుకున్నాడు. ముంతాజ్ క్రీ.శ.1630 లేదా 1631లో చనిపోయింది. వారి 18సంవత్సరాల కాపురంలో ఆమె 14మంది బిడ్డలకు జన్మనిచ్చింది. 14వ బిడ్డకు జన్మనిస్తూనే కన్నుమూసింది. షాజహాన్ జమానాలో వందలమంది స్త్రీలలో ముంతాజ్ ఒకరు. అంతేకానీ, ఆమెమీద షాజహాన్ కు అంత ప్రేమలేదంటారు కొందరు. ముంతాజ్ చనిపోయినప్పుడు ఆమె ఢిల్లీకి దగ్గరలో ఉన్న ఖుర్హాన్ పూర్‌లోని మందిరంలో ఉంది.

ఆమెను ఆ భవన సముదాయంలోని ఒక చిన్న భవనంలో ఖననం చేశారట. ఆ తరువాతి సంవత్సరం ఆమె శరీరాన్ని ఆగ్రాకు తరలించి, నేడు తాజ్ మహల్ అని పిలిచే ప్రాంతంలో ఉంచారట. 1905 సంవత్సరం వరకు ఆగ్రా గజెట్ లో రాజా మాన్ సింగ్ భవనంగా ఉన్న తాజ్ మహల్, 1905లో లార్డ్ కర్జన్ హయాంలో షాజహాన్ నిర్మించినట్లుగా వక్రీకరించి రాశారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. దీనికి కారణం, హిందూ, ముస్లింలను చీల్చటానికేనన్నది వారి విశ్లేషణ. తేజోమహాలయ ఆలయ భూమిలోని కొంతభాగాన్ని రాజా జాయ్ సింగ్ నుంచి మొఘల్ చక్రవర్తి షాజహాన్ కొనుగోలు చేశారని, ఇప్పటికీ వాదిస్తున్నారు యూపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజపేయి. దీనికి సంబంధించిన పత్రాలు ఇప్పటికీ ఉన్నాయంటున్నారు. ఇప్పటికీ తాజ్‌మహల్‌లోని క్రింది అంతస్తులోని 22 గదులు సీలు వేసి ఉన్నాయని, వాటిలోకి సందర్శకులకు అనుమతి లేదంటున్నారు ఆరెస్సెస్, శివసేన నేతలు, హిస్టారియన్స్. షాజహాన్, ముంతాజ్ సమాధుల చుట్టూ ఉన్న గదులన్నీ ఇటుకలతో మూసివేశారు. అలాగే రహస్యమార్గాలు, యమునలోకి ఉన్న సోపానమార్గాలు, అదే ఆవరణలో ఏడంతస్తుల లోతులో ఉన్న బావి, దానిచుట్టూ చల్లగా ఉండే గదులు, తాజ్ చుట్టూ ఉన్న నౌకలకు లంగరు వేసే రింగులు, ఉద్యానవనంలో ఉన్న శిఖరం నీడ, ఇవన్నీ కూడా తాజ్‌మహల్ సమాధికోసం కట్టినవి కాదని, అదొక ఆలయమనడానికి రుజువులంటున్నారు.

తాజ్‌కి రెండువైపులా ఉన్న వంటశాల, వాయిద్యాలను దాచే మందిరం ఆలయమేనని ఋజువు చేస్తున్నాయంటారు కొందరు చరిత్రకారులు. ఇప్పటికీ సమాధిని దర్శించే సందర్శకులు చెప్పులు విడిచి లోపలికి వెళ్ళడం ఆనవాయితీ.

ఒకవేళ నిజంగా అది ముంతాజ్ కోసం నిర్మించిన సమాధి అయితే ఇవన్నీ అనవసరం కదా అంటున్నారు.

ఇటుకలను అడ్డుపెట్టి మూసేసిన గదులను మళ్ళీ తెరిస్తే, తాజ్ కి సంబంధించిన చాలా వాస్తవాలు తెలుసుకుంటే, బహుశా భారతదేశ చరిత్ర మరోవిధంగా వ్రాసుకోవచ్చునంటున్నారు. ఇదీ తాజ్‌మహల్‌పై హిందూత్వదులు, కొందరు చరిత్రకారుల వాదన.

Show Full Article
Print Article
Next Story
More Stories