అతిరథుల పోరుగడ్డ..

అతిరథుల పోరుగడ్డ..
x
Highlights

రాజకీయ ఉదండులు ఇప్పుడు హోరాహోరీ అంటున్నారు. క్రియాశీలక పాత్ర పోషించి రాజకీయాలను తమదైన వ్యూహాలతో ఊహించని మలుపులు తిప్పని నాయకులిప్పుడు సై అంటే సై...

రాజకీయ ఉదండులు ఇప్పుడు హోరాహోరీ అంటున్నారు. క్రియాశీలక పాత్ర పోషించి రాజకీయాలను తమదైన వ్యూహాలతో ఊహించని మలుపులు తిప్పని నాయకులిప్పుడు సై అంటే సై అంటున్నారు. బీహార్‌, జార్ఖండ్‌లో పాత పద్దతలకు స్వస్తివచనం పలికి కొత్త సంప్రదాయానికి తెర తీస్తామంటున్నారు. ఫలితం ఏదైనా పరిణామాలు మాత్రం వేరేగా ఉంటాయంటున్నారు బీహార్‌, జార్ఖండ్‌ ఉద్దండులు.

ఐదో దశలో మే 6న పోలింగ్‌ జరిగే బీహార్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలు, జార్ఖండ్‌లోని నాలుగు సీట్లకు రెండు రాజకీయ కూటముల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. బీహార్‌లోని మొత్తం 40 సీట్లకు ఏడు దశల్లో, జార్ఖండ్‌లోని 14 స్థానాలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్‌లోని మిథిలా, చంపారణ్‌ ప్రాంతాలకు చెందిన సీతామఢీ, మధుబనీ, ముజఫ్ఫర్‌పూర్, సారణ్, హాజీపూర్‌లో భాగస్వామ్యపక్షాలుగా ఉన్న మహాకూటమి మధ్య ప్రత్యక్ష పోరుకు రంగం సిద్ధమైంది. ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ వియ్యంకుడు చంద్రికా రాయ్‌ లాలూ పాత స్థానం సారణ్‌ నుంచి పోటీ చేస్తుండగా, లోక్‌జనశక్తి పార్టీ నేత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తమ్ముడు పశుపతి కుమార్‌ పారస్‌ అన్న నియోజకవర్గం హాజీపూర్‌ నుంచి పోటీకి దిగారు. ఆర్జేడీ కూటమిలోని వీఐపీ ముజఫ్ఫర్‌పూర్, మధుబని నుంచి పోటీచేస్తోంది.

లాలూ కుటుంబ నియోజకవర్గం సారణ్‌లో ప్రతిష్టాకరమైన పోరుకు రంగం సిద్ధమైంది. 2014లో లాలూ భార్య, మాజీ సీఎం రబ్రీదేవిని రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ 40 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అనే స్వతంత్ర అభ్యర్థి వేల సంఖ్యలో ఓట్లు చీల్చుకున్నారు. ఆయన వల్లే రబ్రీ ఓడిపోయారని ఆర్జేడీ భావించింది. ఈ స్వతంత్ర అభ్యర్థి మళ్లీ ఈసారి కూడా పోటీలో ఉన్నారు. 2004కు ముందు ఛప్రా పేరుతో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి లాలూ మూడుసార్లు, రాజీవ్‌ రూడీ రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఇక- ఐదో దశలో పోలింగ్‌ జరిగే జార్ఖండ్‌లోని నాలుగు సీట్లు–కోడర్మా, రాంచీ, ఖూంటీ, హజారీబాగ్‌ సీట్లలో బీజేపీ కూటమి, కాంగ్రెస్‌ కూటమికి మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ కూటమిలో జేఎంఎం, జేవీఎం, ఆర్జేడీ ఉన్నాయి. రాజధాని రాంచీ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి సుబోధ్‌కాంత్‌ సహాయ్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తుండగా, హజారీబాగ్‌ నుంచి కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్‌ సిన్హా బీజేపీ నుంచి మళ్లీ బరిలోకి దిగారు. కోడర్మా నియోజకవర్గం నుంచి జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్‌ మరాండీ కాంగ్రెస్‌ కూటమి తరఫున పోటీలో ఉన్నారు. షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వ్‌ చేసిన ఖూంటీ స్థానం నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు రంగంలో ఉన్నారు.

జార్ఖండ్‌లో మరో కీలక స్థానమైన కోడర్మాలో బీజేపీ అభ్యర్థి అన్నపూర్ణాదేవి యాదవ్, కాంగ్రెస్‌–జేఎంఎం కూటమి అభ్యర్థి బాబూలాల్‌ మరాండీ మధ్య గట్టి పోటీ జరుగుతోంది. రాష్ట్ర ఆర్జేడీ అధ్యక్షురాలిగా పనిచేసి ఎన్నికల ముందు పార్టీలో చేరిన అన్నపూర్ణాదేవి యాదవ్‌కు బీజేపీ టికెట్‌ లభించింది. బీజేపీ తరఫున జార్ఖండ్‌ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన మరాండీ గతంలో బీజేపీలో ఉండగా రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. జేఎంఎం నేత, మాజీ సీఎం శిబు సొరేన్‌ను ఓడించారు. బీజేపీ తరఫున 2014లో ఇక్కడ నుంచి గెలిచిన రవీంద్రరాయ్‌కు ఈసారి టికెట్‌ ఇవ్వకపోయినా అన్నపూర్ణ తరఫున ప్రచారం చేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో ఆయన తన సమీప సీపీఐ(ఎంఎల్‌–లిబరేషన్‌) ప్రత్యర్థి రాజ్‌కుమార్‌ యాదవ్‌ను దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో ఓడించారు. మళ్లీ రాజ్‌కుమార్‌ పోటీచేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories