శతృఘ్న సిన్హా వర్సెస్‌ రవిశంకర్‌ ప్రసాద్‌.. గెలుపు ఎవరిది.?

శతృఘ్న సిన్హా వర్సెస్‌ రవిశంకర్‌ ప్రసాద్‌.. గెలుపు ఎవరిది.?
x
Highlights

బీహార్ లోని పాట్నా సాహిబ్ నియోజక వర్గం లో పోటీ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి వరకూ ఇద్దరిదీ ఒకే పార్టీ.. కానీ ఇప్పుడు ఇద్దరూ ఎన్నికల బరిలో ప్రత్యర్ధులు...

బీహార్ లోని పాట్నా సాహిబ్ నియోజక వర్గం లో పోటీ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి వరకూ ఇద్దరిదీ ఒకే పార్టీ.. కానీ ఇప్పుడు ఇద్దరూ ఎన్నికల బరిలో ప్రత్యర్ధులు వారే స్టార్ పొలిటీషియన్ శతృఘ్న సిన్హా , లాయర్ పొలిటీషీయన్ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఇద్దరూ హేమా హేమీలే ఇద్దరి బలా బలాలు బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

వారిద్దరూ ఒకప్పుడు ఒకే పార్టీలో ఉండేవారు. బీహార్ రాజకీయాలలో క్రియా శీలకంగా ఉండేవారు.. కానీ కాలం కలసి రాలేదు.. ఇద్దరూ ప్రత్యర్ధులుగా ఒకే నియోజక వర్గం నుంచి బరిలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరు పక్కా రాజకీయ వేత్త.. బీజేపీలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్.. ఇప్పుడు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఆయనే రవిశంకర్ ప్రసాద్..

మరొకరు స్టార్ పొలిటీషియన్ శతృఘ్న సిన్హా.. శతృఘ్న సిన్హా ఒకప్పుడు బీజేపీలోనే ఉండేవారు.. కానీ ఈసారి బీజేపీ పెద్దలు ఆయన కోరుకున్న నియోజక వర్గం ఇవ్వకపోవడంతో నొచ్చుకున్నారు. వెంటనే పార్టీ మారిపోయారు. పాట్నా సాహిబ్ నియోజక వర్గం నుంచి మహా ఘటబంధన్ అభ్యర్ధిగా రంగంలోకి దిగుతున్నారు.

ఇద్దరూ బీహార్ లో బలంగా ఉన్న కాయస్త కులానికి చెందిన వారే.. 2014లో బీజేపీ తరపున బలంగా ప్రచారం చేశారు. కానీ ఈసారి ప్రత్యర్ధులుగా బరిలోకి దిగుతుండటంతో ఇద్దరి మధ్యా బలమైన పోటీ ఉంది.. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో ఇక్కడ ఓట్లు చీలిపోయే ప్రమాదముంది. అంతేకాదు వీరిద్దరూ ప్రభావితం చేసే ఇతర అగ్రవర్ణాల ఓట్లు కూడా ఈసారి చీలిపోయే అవకాశం కనిపిస్తోంది.

పాట్నా సాహిబ్ నియోజక వర్గంలో 28 % అగ్రవర్ణ ఓటర్లున్నారు.. వీరంతా బీజేపీ మద్దతు దారులే.. అగ్రవర్ణ ఓటర్లు ఇక్కడి ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.. బీహార్లో ఏ నియోజక వర్గంలోనూ ఈ పరిస్థితి లేదు. అయితే 2014 కన్నా ఇప్పుడు బీజేపీ ఎక్కువ అగ్రవర్ణ ఓట్లను రాబట్టుకోగలదని సర్వేలు చెబుతున్నాయి. 2014లో బీజేపికి48% , ఆర్జేడీకి 23%, జేడీయూకి6% అగ్రవర్ణ ఓట్లు పడ్డాయి.మరి ఈసారి రవిశంకర్ ప్రసాద్ 63% అగ్రవర్ణ ఓట్లను రాబట్టుకోగలరనే అంచనాలున్నాయి.అయితే గత ఎన్నికల్లో మోడీ వేవ్ తో సిన్హా గెలిచారా లేక ఆయన స్టార్ డమ్ పైనే గెలిచారా అన్నది పెద్ద సందేహం.

రవిశంకర్ ప్రసాద్ అగ్రవర్ణ ఓటర్లను ఆకట్టుకోగలిగినా శత్రుఘ్న సిన్హా చీల్చే కాయస్త కులస్తుల ఓట్లపై బీజేపీకి భయం పట్టుకుంది. 2014లో శత్రుఘ్న సిన్హా బీజేపీ టిక్కెట్ పై పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధిపై 30%శాతం ఓట్ల తేడాతో గెలిచారు.

ఇప్పుడు శత్రుఘ్న సిన్హా కాయస్త కులస్తుల ఓట్లకు తోడు యాదవ, ముస్లిం ఓట్లు కూడా తమకే వస్తాయనే లెక్కల్లో ఉన్నారు.మొత్తానికి ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటుండటంతో పాట్నా సాహిబ్ నియోజక వర్గంలో టఫ్ ఫైట్ కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories