బడ్జెట్‌లో రైల్వేకి భారీ కేటాయింపులు.. అన్నీ ఎన్నికల తాయిలాలే!!

బడ్జెట్‌లో రైల్వేకి భారీ కేటాయింపులు.. అన్నీ ఎన్నికల తాయిలాలే!!
x
Highlights

బడ్జెట్‌లో రైల్వే రంగానికి 64వేల 587 కోట్ల రూపాయలను కేటాయించారు. సూపర్ ఫాస్ట్ ట్రైయిన్ వందే భారత్ ను రైలును త్వరలో పట్టాలెక్కించనున్నట్టు...

బడ్జెట్‌లో రైల్వే రంగానికి 64వేల 587 కోట్ల రూపాయలను కేటాయించారు. సూపర్ ఫాస్ట్ ట్రైయిన్ వందే భారత్ ను రైలును త్వరలో పట్టాలెక్కించనున్నట్టు కేంద్రమంత్రి గోయల్ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మేఘాలయాలను రైల్వేతో అనుసంధానం చేయడంతో పాటు.. కాపలాలేని లెవల్ క్రాసింగ్‌లను తొలగించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 2019 -2020లో రైల్వే రంగానికి కూడా భారీ కేటాయింపులు ప్రకటించింది. ఇప్పటికే పలు రంగాలకు తాయిలాలు ప్రకటించిన కేంద్రం.. భారతీయ రైల్వేలకు ఈ ఏడాది బడ్జెట్‌లో భారీ కేటాయింపులు ఉన్నట్టు తెలిపింది. రైల్వే రంగానికి బడ్జెటరీ సపోర్టు కింద 64వేల 587 కోట్లు కేటాయించినట్లు గోయల్ తెలిపారు. రైల్వేల చరిత్రలో ఇది ప్రమాదాలు తక్కువగా ఉన్న ఏడాది అని గోయల్ స్పష్టం చేశారు.

2018 -2019 కేంద్ర బడ్జెట్లో రైల్వే రంగానికి క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ కింద 1,46,000 కోట్లు ప్రకటించగా.. 2019 -2020 మధ్యంతర బడ్జెట్ లో కేంద్రం.. క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ కింద 1, 58,000 కోట్లు ప్రకటించింది. రైల్వే రంగంలో ప్రమాదాలు గతేడాది తగ్గిపోయాయన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. బ్రాడ్‌గేజ్‌లో కాపలా లేని గేట్లను తొలగించామన్నారు. ఈశాన్య భారతదేశంలో సైతం రైల్వేలైన్ల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో రైల్వేలకు 64,587 కోట్లు కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మేఘాలయాలను రైల్వేలైన్లతో అనుసంధానం చేసిన ఘనత తమ సర్కార్‌దే అన్నారు గోయల్. గతేడాది ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వేశాఖకు.. 1,48,0000 కోట్లు కేటాయించగా.. తాజా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో అందులో సగం నిధులు కేటాయించారు. ప్రతిరోజు దాదాపు 27 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాలు సైతం చేపట్టామని గోయల్ తెలిపారు.

బ్రాడ్‌గేజ్‌లో కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌లను తొలగించారు. అత్యధిక వేగంగా ప్రయాణించే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులోకి రానుంది. రైల్వే ప్రయాణికులకు వరల్డ్ క్లాస్ సౌకర్యం కల్పించడంతో పాటు కొత్త ఉద్యోగాల కల్పన చేయనున్నారు. స్పీడ్ ట్రైన్స్, భద్రతో కూడిన సర్వీసులను అందుబాటులోకి తేనున్నారు. రైల్వే స్టేషన్ల దగ్గర వైఫై కనెక్షన్లు ఏర్పాటు చేయడంతో పాటు రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణాలు చేపట్టనున్నట్టు బడ్జెట్ లో తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories