రాజకీయం... కుంభకోణం ఒకే ఒరలో ఇముడుతాయా?

రాజకీయం... కుంభకోణం ఒకే ఒరలో ఇముడుతాయా?
x
Highlights

రాజకీయం, కుంభకోణం కలగలసిపోయిన రోజులివి. ఇతర కుంభకోణాలెలా ఉన్నప్పటికీ దేశ రక్షణతో ముడిపడిన కుంభకోణాలను మాత్రం తట్టుకోలేం. తాజాగా రాఫెల్ యుద్ధ...

రాజకీయం, కుంభకోణం కలగలసిపోయిన రోజులివి. ఇతర కుంభకోణాలెలా ఉన్నప్పటికీ దేశ రక్షణతో ముడిపడిన కుంభకోణాలను మాత్రం తట్టుకోలేం. తాజాగా రాఫెల్ యుద్ధ విమానాలపై కాగ్ నివేదిక మరోసారి ఆర్మీతో ముడిపడిన కుంభకోణాలకు వేదికగా మారింది. మరి కాంగ్రెస్, బీజేపీలకు అస్త్రంగా మారిన రాఫెల్ కూడా ఇలాంటిదేనా ? అందులోనూ కుంభకోణం ఉందా? రాహుల్ గాంధీ సంధించిన అస్త్రాలు ఫలితమిస్తాయా? వాటిని బీజేపీ ఎలా తిప్పికొడుతోంది? రాఫెల్ అస్త్రం కాంగ్రెస్ కు ఓట్లు రాలుస్తుందా ? బూమరాంగ్ అయి కాంగ్రెస్ నే దెబ్బతీస్తుందా?

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో కుంభకోణం....కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంధించిన ఈ అస్త్రం దేశంలో సంచలనం కలిగించింది. ఇతర కుంభకోణాలతో పోలిస్తే ఆర్మీతో ముడిపడిన కొనుగోళ్ళలో ముడుపులు మరింత తీవ్రమైనవి. గత కొన్ని నెలలుగా రాహుల్ గాంధీ రాఫెల్ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పార్లమెంట్, న్యాయస్థానం....చివరకు కాగ్ దాకా ఇది వెళ్ళింది. తాజాగా కాగ్ నివేదిక కూడా వెలువడింది. ఆ నివేదికనే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలకు సరికొత్త అస్త్రాలను అందిస్తోంది.

ఫ్రాన్స్ కంపెనీ నుంచి రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోళ్ళపై రాహుల్ తన అస్త్రాలను సంధించారు. దేశ ప్రధానిపై నేరుగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఒక ప్రధానిపై ఈ తరహా ఆరోపణలు నేరుగా రావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. గతంలో రాజీవ్ గాంధీపై ఈ తరహా ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ గమనించాల్సిన అంశాలు మరికొన్ని కూడా ఉన్నాయి. బోఫోర్స్ విషయంలో ఉన్నంత తీవ్రత రాఫెల్ విషయంలో కనిపించడం లేదు. మరో వైపున బీజేపీ నెహ్రూ హయాం నుంచి రాజీవ్ గాంధీ హయాం దాకా తప్పిదాలను ప్రచారాస్త్రాలుగా చేసుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories