భారత్‌ను తాకుతున్న పబ్‌జీ సెగలు... ఆర్పే దారేమైనా ఉందా?

భారత్‌ను తాకుతున్న పబ్‌జీ సెగలు... ఆర్పే దారేమైనా ఉందా?
x
Highlights

ప్లేయర్స్ అన్నోన్ బాటిల్ గ్రౌండ్ ఆన్ లైన్ గేమ్ అంటే కొంతమందికే అర్థమవుతుంది. అదే పబ్ జి గేమ్ అంటే అందరికీ తెలిసిపోతుంది. భారత్ లోనే గాకుండా యావత్...

ప్లేయర్స్ అన్నోన్ బాటిల్ గ్రౌండ్ ఆన్ లైన్ గేమ్ అంటే కొంతమందికే అర్థమవుతుంది. అదే పబ్ జి గేమ్ అంటే అందరికీ తెలిసిపోతుంది. భారత్ లోనే గాకుండా యావత్ ప్రపంచాన్ని ఈ ఆట కుదిపేస్తోంది. పిల్లల మొబైల్ స్క్రీన్ లను మాత్రమే కాదు....వారి మెదళ్ళను కూడా యుద్ధరంగంగా మార్చేస్తోంది. మరి ఈ యుద్ధరంగం నుంచి మన చిన్నారులను కాపాడుకోలేమా? అలాంటి ఆన్ లైన్ గేమ్స్ ను నిషేధించలేమా? పబ్ జి నిషేధించాలని చిన్నారులు సైతం కోర్టు మెట్లు ఎక్కాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఈ ఆట ఆడేందుకు ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే..... వారి పుత్రశోకాన్ని తీర్చేదెవరు? ఇలాంటి దుష్ఫలితాలకు గేమింగ్ తయారీ సంస్థలను బాధ్యులుగా చేయలేమా?

భారత్ లో ఇప్పుడు పబ్ జి సెగలు రగిలిపోతున్నాయి. ఆ సెగలు ఇప్పటికే కొన్ని నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. తల్లులకు పుత్రశోకాన్ని మిగిల్చాయి. మరెందరో తల్లిదం‌డ్రులకు మనో వేదన కలిగిస్తున్నాయి. చిన్నారుల మెదళ్ళను యుద్ధరంగాలుగా మార్చి....వారిని అనారోగ్యాల పాలు చేస్తున్నాయి. ఈ సెగలు ప్రధాని నరేంద్ర మోడీని తాకాయి. న్యాయస్థానాలకూ అంటుకున్నాయి. తాజాగా బాలల హక్కుల సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. పబ్ జి లాంటి గేమ్స్ ను హానికరమైనవిగా ప్రకటించాయి.

కొంతకాలం క్రితం పోక్ మాన్ సృష్టించిన బీభత్సం ఇంకా గుర్తుండే ఉంటుంది. ఆ ఆట ఆడుతూ ఎంతో మంది ప్రమాదాలకు గురయ్యారు. మరికొందరు నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్ళి దోపిడీలకు, హత్యలకు గురయ్యారు. తాజాగా పబ్ జి గేమ్ తో కూడా ఇలాంటి దారుణాలు మొదలవుతున్నాయి. అధునాతన స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.....పబ్ జి గేమ్ ఆడుతున్న మరెందరో మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. మొత్తం మీద వినోదం అందించాల్సిన గేమ్ కాస్తా సామాజిక అశాంతికి కారణమవుతోంది. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన స్థాయికి పరిస్థితి దిగజారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories