ప్రియాంక.... నాన్న మాట... నానమ్మ బాట

ప్రియాంక.... నాన్న మాట... నానమ్మ బాట
x
Highlights

కాంగ్రెస్‌ రాజకీయాల్లో మరో సంచలనం. పార్టీకి పరోక్షంగా, అన్నకు అండగా ఉన్న ప్రియాంకాగాంధీ... ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్నారు. అందం, ఆకర్షణ.. ...

కాంగ్రెస్‌ రాజకీయాల్లో మరో సంచలనం. పార్టీకి పరోక్షంగా, అన్నకు అండగా ఉన్న ప్రియాంకాగాంధీ... ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్నారు. అందం, ఆకర్షణ.. చురుకుతనంతో, తండ్రి, నానమ్మ పోలికలతో వుండే ప్రియాంక రాహుల్ సోదరిగా, రాజీవ్ కుమార్తెగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రాజీవ్ మరణం తర్వాత ప్రియాంక రాజకీయాల్లోకి రాలేదు.. సరికదా.. రాబర్ట్ వధేరా అనే ఓ సాదా సీదా వ్యాపార వేత్తను పెళ్లాడి ఇంటికి పరిమితమైపోయింది.

పార్టీ ఎన్నికల ప్రచారం, పార్టీ సంబంధిత సమావేశాలకు ప్రియాంక సాధారణంగా నూలు దుస్తులే ధరిస్తారు. చీర కట్టుకుని వస్తారు.. ప్రజల ముందే తల్లి బుగ్గ గిల్లి సందడి చేస్తారు. ప్రియాంక ప్రచారం రాహుల్ కి ఎంత మైలేజీ కలిగించిందో చెప్పలేం కానీ, ప్రజలు, ప్రత్యేకించి ఓటర్ల దృష్టిని ఆకర్షించడంలో ఆమె విజయం సాధించారు. మెరిసిపోయేఅందంతో రాజకీయ యవనికపై తళుక్కు మన్నారు.ఇప్పటి వరకూ ఎన్నికల ప్రచారానికే పరిమితమైన ప్రియాంక... ఇప్పుడు భవిష్యత్తు రాజకీయాలను శాసించబోతున్నారు.

ప్రియాంక ఢిల్లీలో వుంటే.. చాలా ఫ్యాషనబుల్‌గా కనిపిస్తారు.. పేజ్ త్రీ సంస్కృతిని ప్రతిబింబించే డ్రస్సులతో అత్యాధునికంగా కనిపిస్తారు. ఇద్దరు పిల్లలకు తల్లైన ప్రియాంక ఓ సాధారణ గృహిణిగా స్థిరపడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి అవసరమనుకున్న తరుణంలో మాత్రం ప్రచారం చేసేందుకు ముందుకొచ్చారు. రాహుల్ గాంధీ సత్తాకు అగ్ని పరీక్షగా మారిన యూపి ఎన్నికల్లోనూ అంతకుముందు సార్వత్రిక ఎన్నికల్లో సోనియా, రాహుల్ గెలుపు కోసం ప్రిఅయాంక శ్రమించారు. నెలల తరబడి యూపిలోనే మకాం వేసి ఇంటింటికీ వెళ్లి మరీ ఓట్లు అభ్యర్ధించారు. నానమ్మ యాసలో మాట్లాడుతూ గ్రామీణ ఓటర్లను హత్తుకుంటూ ప్రియాంక ప్రచారం సాగింది..

Show Full Article
Print Article
Next Story
More Stories