ములాయం స్కెచ్చేంటి... మోడీని ఎందుకు పొగిడారు?

ములాయం స్కెచ్చేంటి... మోడీని ఎందుకు పొగిడారు?
x
Highlights

మొన్న చంద్రబాబు ఢిల్లీ ధర్నాకు వచ్చి మద్దతిచ్చాడు. మోడీ వ్యతిరేక గళంతో స్వరం కలిపాడు. కట్‌ చేస్తే పార్లమెంట్‌లో అదే మోడీపై ప్రశంసలు కురిపించాడు....

మొన్న చంద్రబాబు ఢిల్లీ ధర్నాకు వచ్చి మద్దతిచ్చాడు. మోడీ వ్యతిరేక గళంతో స్వరం కలిపాడు. కట్‌ చేస్తే పార్లమెంట్‌లో అదే మోడీపై ప్రశంసలు కురిపించాడు. మళ్లీ మోడీని ప్రధాని కావాలని ముసిముసి నవ్వులు నవ్వి, బీజేపీ వ్యతిరేకపక్షంలో భూకంపం సృష్టించాడు. ములాయం సింగ్ యాదవ్ మోడీకి మద్దతివ్వడం వెనక మతలబు ఉందా.. 16వ లోక్‌సభ చివరి రోజు, ములాయం పేల్చిన ఈ బాంబు బ్యాగ్రౌండ్‌ ఏంటి? కొడుకు అఖిలేషేమో, మోడీ వ్యతిరేక దళంతో చేయి కలుపుతున్నాడు... మోడీ సర్కారును ఎండగట్టే చంద్రబాబు దీక్షకు, ములాయం మద్దతిచ్చాడు....విజువల్స్ బైట్..ములాయం ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్‌, ఏకంగా నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తి, బీజేపీ వ్యతిరేక పక్షాల కూటమికే కాదు, సొంత పార్టీకే షాకిచ్చాడు...

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ లోక్‌సభ సాక్షిగా ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించడం సంచలనమవుతోంది. మోడీ అందర్నీ కలుపుకొని వెళ్తున్నారని, ఆయన పరిపాలన బాగుందని తెగ పొగిడేశారు. 2019 లో మరోసారి మోడీ ప్రధాని కావాలని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. అధికార పార్టీ ఎంపీలు సంతోషంతో బల్లలు చరిచారు. ములాయం ప్రశంసిస్తుండగా మోడీ చిరునవ్వులు చిందించారు. తన సీటులోంచే ములాయంకు నమస్కారం చేశారం. అయితే ములాయం పక్కనే కూర్చున్న సోనియాగాంధీ మాత్రం నిర్ఘాంత పోయారు.

లోక్‌సభ ఆఖరిరోజు, ఆఖరి ప్రసంగం చేసిన నరేంద్ర మోడీ, ములాయంకు కతృతజ్నతలు తెలిపారు. ములాయం మద్దతు వెనక మతలబు ఉందా? వ్యూహాత్మకంగా మాట్లాడారా? మోడీనే మాట్లాడించారా? బీజేపీకి వ్యతిరేకంగా జట్టుకడుతున్న ఎస్పీ, బీఎస్పీలకు ఇది ఎలాంటి సంకేతం? ములాయం సింగ్‌ యాదవ్. సమాజ్్వాదీ వ్యవస్థాపకుడు. దశాబ్దాల పాటు జాతీయ రాజకీయాలను ఎంతోకొంత శాసించారు. కానీ ములాయం తీరు గమనించినవారికి, ఇప్పుడు మోడీపై చేసిన ప్రశంసల ప్రహసనం కొత్తేమీ అనిపించదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ములాయంను మించినవారు లేరన్నది ఢిల్లీ ఎరిగిన సత్యం. పెద్ద రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ, వృద్దాప్యంలో కూరుకుపోయి, చివరి మజిలీలో ప్రధాని పీఠం ఎక్కాలనుకుంటున్న ములాయం, ఎన్నికల ముంగిట్లో ఇలాంటి విన్యాసాలు చేయడం కొత్తేమీ కాదు.

ఎస్పీని ములాయమే స్థాపించినా, ఇప్పుడాయన పార్టీలో క్రియాశీలకంగాలేరు. 2017 అసెంబ్లీ ఎన్నికల టైంలో, కొడుకు అఖిలేష్‌తో గొడవపడ్డారు. అఖిలేష్‌ పార్టీ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుని, ఒకరకంగా ములాయంను బహిష్కరించారు. ఇప్పుడు ఎస్పీలో ములాయం నామమాత్రమే. మొత్తం కొడుకు అఖిలేషే చూసుకుంటున్నాడు. పొత్తుల చర్చలు చేస్తున్నాడు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ కట్టేవారికి మద్దతిస్తున్నారు. కానీ ములాయం చేసిన వ్యాఖ్యలు, సొంత పార్టీకే తలనొప్పులు తెస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ, బీఎస్పీ జట్టుకట్టాయి. కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, బీజేపీకి వ్యతిరేకంగా కడుతున్న కూటమికి వివిధ వేదికల్లో అఖిలేష్ మద్దతిస్తున్నారు. మొన్న చంద్రబాబు దీక్షకూ ములాయం సపోర్ట్ పలికారు. అంతేకాదు, కేజ్రీవాల్‌ నేతృత్వంలో, ఢిల్లీలోనే సాగుతున్న మహాకూటమికి ఎస్పీ నేతలు మద్దతిచ్చారు. కానీ పార్లమెంట్‌లో మాత్రం ములాయం మోడీని పొగిడారు. అయితే వ్యూహాత్మకంగా ములాయం మాట్లాడారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కొడుకు ఒక కూటమిలో, తండ్రి మరో కూటమిలో ఉండటం స్ట్రాటజీనే అంటున్నారు. యూపీలో ఎస్పీకి ఎక్కువ సీట్లొచ్చి, బీజేపీ, కాంగ్రెస్‌లకు మెజారిటీ రాకపోతే, ఒకవేళ మహాకూటమికి బీజేపీ మద్దతు అవసరమైతే, ములాయం ప్రధాని అభ్యర్థిత్వానికి మద్దతివ్వొచ్చు. ఎలాగూ మరో కూటమిలో కొడుకు ఉన్నాడు కాబట్టి, అటు నుంచి తండ్రిని సిఫార్సు చేయొచ్చు. అందుకే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ములాయం పాచిక విసిరారు. ఇలాంటివి ములాయంకు వెన్నతో పెట్టిన రాజకీయాలు. అంతేకాదు, కేసుల భయం కూడా ములాయం వెంటాడొచ్చని, అందుకే మోడీ వైపు పువ్వులు విసిరారని మరికొందరి విశ్లేషకుల భావన. లేదంటే మోడీనే వ్యూహాత్మకంగా ములాయంతో మాట్లాడించారన్న వాదనా వినిపిస్తోంది. వీరిద్దరి మధ్య ఒప్పందం ఉండొచ్చన్నది అంచనా. సోనియా పక్కనే కూర్చుని, అప్పటి వరకూ ఆమెతో మాట్లాడి, చివరకు ఆమె ముందే, మోడీని పొగడటం ములాయంకే చెల్లింది. ఇది బీజేపీ వ్యతిరేక పక్షాల కన్నా, సొంత పార్టీకే నష్టం. కొడుకేమో మోడీని తిట్టడం, తండ్రేమో పొగడటం, ఓటర్లలో గందరగోళం సృష్టించడం ఖాయం. దీంతో ఇప్పటికే ఎస్పీ వర్గాలు ములాయం వ్యాఖ్యలపై స్పందించాయి. పార్లమెంట్‌ సభ్యులందర్నీ ప్రశంసించారని, అందులో భాగంగా మోడీనీ పొగిడారని అంటున్నారు. ములాయం కూడా తర్వాత అదే చెప్పారు. మొత్తానికి ప్రధాని పదవి కోసం అనేక దశాబ్దాల నుంచీ ఎదురుచూస్తున్న ములాయం సింగ్ యాదవ్, ఎన్నికల ముంగిట్లో మోడీకి మద్దతు పలకడం చర్చనీయాంశమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories